తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు | Christmas Celebrations Across Telugu States | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 25 2018 11:30 AM | Last Updated on Tue, Dec 25 2018 12:02 PM

Christmas Celebrations Across Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా చర్చిలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రార్థన మందిరాలు విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్నాయి.

  • మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బిషప్‌ సాల్మన్‌ రాజ్‌ ఆధ్వర్యంలో తెల్లవారుజామున శిలువ ఊరేగింపు నిర్వహించారు.
  • కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకల్లో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త జోగి రమేశ్‌ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.
  • కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా సీఎస్‌ఐ, ఆర్‌సీఎం చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్నవరం, నిడమానూరులోని పలు చర్చిలో జరుగుతున్న క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
  • విశాఖపట్నం పెదబయలు మండలంలో జరుగుతున్న ఐక్య క్రిస్మస్‌ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పాల్గొన్నారు.
  • వైఎస్సార్‌ జిల్లా రాజంపేటలోని పలు చర్చిలలో క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ప్రార్థనలు చేశారు. పలు చర్చిల్లో కేక్‌ కట్‌ చేసి ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు.
  • విశాఖపట్నం అరకు మండలం పనిరంగిలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకల్లో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు.
  • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూపాంతర దేవాలయం చర్చిలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌, వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోసేనురాజు పాల్గొన్నారు.
  • నెల్లూరు నగరంలోని సెయింట్‌ జోసెఫ్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.


     
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సీఎస్‌ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకలకు ఎమ్మెల్యే దివాకర్‌ రావు హాజరయ్యారు. కేక్‌ కట్‌ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.
  • అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంతి నిలయంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో విదేశీ భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి మహా సమాధి వద్ద విదేశీ భక్తులు ప్రార్థనలు నిర్వహించారు.
  • సూర్యాపేటలోని మేరిమాత చర్చిలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
  • భద్రాద్రి జిల్లాలోని చర్ల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 
  • ఖమ్మంలోని సెయింట్‌ మేరీస్‌ చర్చిలో క్రిస్మస్‌ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.
  • విజయవాడలో క్రిస్మస్‌ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని చర్చిలు సర్వాంగ సుందరంగా అలకరించారు. గుణదల మేరిమాత చర్చిలో క్రీస్తు ఆరాధన కొనసాగుతుంది.
  • కాకినాడలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 
  • విశాఖపట్నం అల్లిపురం కల్వారి బాప్టిస్ట్‌,  పాతనగరం లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement