ప్రపంచంలోనే అత్యంత పాపులర్ తొలి పది చర్చిల విశేషాలు.. | world's most Popular first ten Churches Details .. | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత పాపులర్ తొలి పది చర్చిల విశేషాలు..

Published Fri, Dec 25 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

ప్రపంచంలోనే అత్యంత పాపులర్ తొలి పది చర్చిల విశేషాలు..

ప్రపంచంలోనే అత్యంత పాపులర్ తొలి పది చర్చిల విశేషాలు..

పపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.
ప్రతీ దేశంలోని క్రైస్తవులంతా తమకు దగ్గర్లోని చర్చికెళ్లి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు.
దీంతో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన తొలి పది చర్చిల విశేషాలు..

 
1. సాగ్రడా ఫెమీలియా
బార్సిలోనాలోనే అతిపెద్దదైన ‘సాగ్రడా ఫెమీలియా’ రోమన్ క్యాథలిక్ చర్చిని క్యాటలాన్ వాస్తుశిల్పి ఆంటోనీ గాధీలో నిర్మాణం ప్రారంభించాడు. 1882లో మొదలైన నిర్మాణం ఈ రోజుకూ కొనసాగుతూనే ఉంది.
 
2. సెయింట్ బాసిల్ క్యాథడ్రల్
రష్యాలోని మాస్కోలో రెడ్ స్క్వేర్ ప్రాంతంలో ఉందీ చర్చి. సెయింట్ బాసిల్ క్యాథడ్రల్‌గా పేరుగాంచిన ఈ చర్చిని 1555-1561 కా లంలో నిర్మించారు. ఆర్థోడాక్స్ చర్చిలో ప్రముఖమైన ఈ చర్చి.. మాస్కో మధ్యలో ఉంది.
 
3. నోర్డే డామ్ డి పారిస్
‘నోర్డే డామ్ డి పారిస్’గా పిలిచే ఈ చర్చి యూరప్‌లోనే అత్యంత అందమైన చర్చిగా పేరొందింది. మధ్యయుగం నాటి నుంచే పారిస్‌లో వెలుగొందిన ఈ చర్చి నిర్మాణం పూర్తవడానికి వందేళ్లు పట్టిందట.
 
4. సెయింట్ పీటర్స్ బాసిలికా
సెయింట్ పీటర్స్ బాసిలికాను 1506-1615కాలంలో రోమ్‌లో నిర్మించారు. చర్చి ప్రధాన గుమ్మటాన్ని ప్రఖ్యాత చిత్రకారుడు మైకలాంజలో 1547లో డిజైన్ చేశాడు. డోమ్ ఎత్తు ఏకంగా 448.1 అడుగులు.
 
5. వెస్ట్‌మిన్‌స్టర్ అబే
లండన్ కీర్తిని చాటే అద్భుతాల్లో ‘వెస్ట్‌మిన్‌స్టర్ అబే’ చర్చి ఒకటి. పదో శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చి మొత్తం బ్రిటన్‌లోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న మతకట్టడం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఇది ఉంది.
 
6. సెయింట్ పాల్ క్యాథడ్రల్
లండన్ బిషప్ అధీనంలో ఉండే ఈ సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చి ధవళ వర్ణంలో మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకుంటుంది. లండన్‌లోనే అత్యంత ఎత్తయిన కొండప్రాంతంలో 17వ శతాబ్దంలో నిర్మించారు.
 
7. చర్చి ఆఫ్ నేటివిటీ
క్రీస్తు పుట్టిన ప్రాంతంగా ఖ్యాతికెక్కిన ‘చర్చి ఆఫ్ నేటివిటీ’ పాలస్తీనాలోని బెత్లెహాంలో ఉంది. క్రీ.శ.327లో
 దీనిని నిర్మించారు. కాన్‌స్టాంటిన్, హెలెనాలు దీనిని కట్టారు.
 
8. హోలీ సెపల్కర్
క్రీస్తును శిలువ వేసిన ప్రాంతంలో ఉందీ చర్చి. పాత జెరూసలెం పట్టణంలోని కల్వరీ కొండపై ఈ ‘హోలీ సెపల్కర్’ను నిర్మించారు. ఇక్కడ క్రీస్తు సమాధి ఉందని కొందరి విశ్వాసం.
 
9. సెయింట్ మార్క్స్
సెయింట్ మార్క్స్ చర్చిని ఇటలీలోని వెనీస్ నగరంలో కట్టారు. బైజాంటియన్ శైలిలో నిర్మించిన అద్భుత కట్టడమిది. 1650లో నిర్మాణం పూర్తయిన ఈ చర్చిని వెనీస్‌కు వచ్చిన ప్రతీ యాత్రికుడు చూస్తారట.
 
10. హగియా సోఫియా
టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉంది. 537 నుంచి 1453 సంవత్సరం వరకు చర్చిగా కొనసాగింది. తర్వాత ఇంపీరియల్ మసీదుగా పేరుపొందింది. 1935 నుంచి మ్యూజియంగా కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement