హల్లెలూయ..!
Published Thu, Dec 26 2013 3:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు నగరంలోనూ, జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రభువుకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చిల వెలుపల పేదలకు కానుకలు అందించారు. గృహాల్లో క్రిస్మస్ ట్రీలు, ఇతర అలంకరణలతో ముస్తాబు చేశారు. చర్చిలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. మందిరాలను రంగులతో తీర్చిదిద్దారు. కాలనీలన్నీ క్రిస్మస్ రాకను తెలియజేసే నక్షత్రాలతో కళకళలాడాయి. జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత గల ఫిరంగిపురం, రెంటచింతల, సాగర్‌మాత చర్చిల్లో వేలాదిమంది భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్‌లో ఉన్న నార్త్ ప్యారిష్ చర్చి,
ఆంధ్రా రోమ్‌గా ఖ్యాతి గాంచిన ఫిరంగిపురంలోని బాలయేసు కెథడ్రల్ దేవాలయంలోనూ బిషప్ గాలిబాలి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. రెంటచింతలలోని లూథరన్ చర్చిలో పాస్టర్ జి.అన్నారావు, కానుకల మాత చర్చిలో ఫాదర్ పుట్టి సుందరరాజు, అల్లం రాయపరెడ్డి, గోవిందు బాలస్వామి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. మాచర్లలోని ఏఈఎల్ చర్చి, ముత్యాలంపాడులోని లూర్థుమాత ఆలయం, తాళ్లచెరువులోని బాలయేసు ఆలయం, రేపల్లెలోని ఏఈఎల్‌సీ, సత్తెనపల్లిలోని ఆర్‌సీఎం చర్చిలను, గుంటూరు, తెనాలి ఐతానగర్ చర్చిల్లో క్రీస్తు ప్రార్థనలు ఘనంగా జరిగాయి. గుంటూరు నగరంలోని పలు చర్చిల్లో కరుణామయుని భక్తి తన్మయత్వంతో ప్రార్ధించారు.
రింగ్‌రోడ్డులోని డాన్‌బాస్కో ప్రాంగణంలో ఉన్న నిత్య సహాయ మాత దేవాలయంలో ఫాదర్ పీటర్ ప్రార్ధనలు జరిపారు. ఏసీ కళాశాల సమీపంలోని పునీత ఆగ్నేశమ్మ దేవాలయంలో ఫాదర్ ఏపూడి రాయప్ప ప్రార్ధనలు చేశారు. నగరంపాలెంలోని ఆంథోనివారి పుణ్యక్షేత్రంలో ఫాదర్ ఆంథోని ప్రార్ధనలు జరిపారు. బొంగరాలబీడులోని లూర్ధు మాత దేవాలయంలో ఫాదర్ గాలి శౌర్రెడ్డి ప్రార్ధనలు నిర్వహించారు. స్తంభాలగరువులోని బాల ఏసు పుణ్యక్షేత్రంలో ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి ప్రార్ధనలు చేశారు. గోరంట్లలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఫాదర్ వై.శౌరిరాజు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈస్ట్ ప్యారీష్ చర్చిలో రెవరెండ్ వై.ఆదాం, వెస్ట్ ప్యారీష్ చర్చిలో రెవరెండ్ విక్టర్ మోజెస్, సౌత్ ప్యారీష్ చర్చిలో రెవరెండ్ ఎ.బాలసుందరం, రెండవ సౌత్ ప్యారీష్ సెయింట్ జాన్ చర్చిలో రెవ. కె.కె.కుమార్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
Advertisement