చిట్యాల : భూపాలపల్లి ఎమ్మెల్యే, శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి తొందరగా కోలుకోవాలని మండలంలోని మసీదులలో శుక్రవారం ముస్లిం సోదరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ ఇటీవల వడదెబ్బకు గురై నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధితమే. ఈ మేరకు చల్లగరిగె, వెలిశాల, చిట్యాల, టేకుమట్ల, గోపాలపురం గ్రామాలలోని మసీదులలో మైనార్టీ సెల్ మండల నాయకులు ఎండీ రబ్బాని, కమ్రోద్దిన్, రాజ్‌మహ్మద్ ఆధ్వర్యంలో స్పీకర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నమాజ్ చేసారు.
కొడకండ్లలో..
కోల్‌బెల్ట్ : తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని కోరుతూ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ గని వద్ద శుక్రవారం కార్మికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గని ఆవరణలో గల ఆలయంలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ బాషనపల్లి కుమారస్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి స్పీకర్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని కోరారు. అనంతరం గని ఆవరణలో కార్మికులకు ఉగాది పచ్చడిని పంచారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు ఏరుకొండ సంపత్, ఆలయ కమిటీ చైర్మన్ డి. సాంబరెడ్డి, సభ్యులు అయిలయ్య, రవి, రాజ్‌కుమార్, సాంబయ్య, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.