భద్రాద్రి రామయ్యకు డీజీపీ పూజలు | dgp anurag sharma visits bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాద్రి రామయ్యకు డీజీపీ పూజలు

Published Sat, Sep 10 2016 8:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

dgp anurag sharma visits bhadrachalam

భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement