
కోరిన కోరికలు తీర్చే కోతిదేవుడు
మండలంలోని పీచర-ధర్మారం గ్రామాల మధ్య గల కోతిదేవుని ఆలయ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి.
లక్ష్మణచాంద :మండలంలోని పీచర-ధర్మారం గ్రామాల మధ్య గల కోతిదేవుని ఆలయ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. శనివారం వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కోరిన కోరికలు తీర్చే కోతిదేవుని జాతరను ఏటా డిసెంబర్ 18,19,20 తేదీల్లో ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. రెండో రోజు జాతర, అన్నదానం, రథోత్సవం నిర్వహిస్తారు. మూడో రోజు ప్రత్యేక పూజలతోపాటు రథోత్సవం నిర్వహిస్తారు. మూడు రోజుల పాటుసాగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులుపెద్ద మొత్తంలో తరలివస్తారు.
ఇది ఆలయ చరిత్ర
ఇంతటి ప్రాశస్యం కలిగి..వేలాది మంది భక్తుల రాకతో కలకలలాడే ఈ ఆలయంలో ఉన్నది కోతిదేవుడే. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం, పీచర గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు గ్రామాల్లోకి ఓ కోతి వచ్చింది. ఆ కోతి క్రమంగా ఇళ్ల మధ్య తిరుగుతూ గ్రామస్తులు పెట్టింది తింటూ, ఇరు గ్రామాల మధ్యలోని ఓ ప్రదేశంలో పడుకునేది. అలా కోతి గ్రామంలోని ప్రజలకు సై తం చేరువైంది. ప్రతీ రోజు గ్రామంలోని ఓ హోటల్ వద్దకు రాగా ఆ హోటల్ యజమాని దానికి టీ పోసేవాడు.
ఇలా క్రమంగా గ్రామస్తులకు చేరువై వారితో పాటు ఎండ్లబండ్లపై పంటపొలాలకు వెళ్లేది. ఇలా కొద్ది నెలల తర్వాత కోతి ఒకనాడు హోటల్ యజమాని కలలోకి వచ్చి, తాను రేపు మరణిస్తున్నానని, తనను రోజు పడుకునే ప్రదేశంలో సమాధి చే యాలని కోరింది. తెల్లవారి హోటల్ యజ మాని విషయం గ్రామస్తులకు చెప్పి కోతి నిద్రించే ప్రదేశంలోకి వెళ్లి చూడగా కోతి మృతి చెందివుంది. దీంతో గ్రామస్తులు ఆ కోతి నిద్రించే ప్రదేశంలోనే సంప్రదాయ బద్ధంగా కోతిని సమాధి చేశారు. అనంతరం ఆలయ నిర్మాణం గావించారు.
ఏటా భక్తుల కోరికలు నెరవేరడంతో వేలాదిగా తరలివస్తున్నారు. కో తి దేవున్ని సాక్షత్తు ఆంజనేయస్వామిగా బా వించి ఇక్కడ పూజలు చేస్తారు. కోతిని సమా ది చేసిన రోజున ప్రతీ సంవత్సరం డిసెంబర్ 18,19,20 తేదీలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ శనివారం మండల నలుమూలల నుంచి భక్తులు పెద్ద మొత్తంలో తరలివ చ్చి పూజలు చేస్తారు. కాగా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు స్థానిక సర్పం చుతోపాటు ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకుంటున్నారు.