మతసామరస్యానికి ప్రతీక అయిన జాన్‌పహాడ్ దర్గా ఉర్సు శనివారం దీపారాధన (చిరాగ్)తో ముగిసింది. ఇదిలా ఉండగా ఈ నెల 23న గుసుల్ షరీఫ్‌తో ఉత్సవాలు ప్రారంభం కాగా 24న గంధం ఊరేగింపు నిర్వహించారు. ఉర్సు చివరిరోజు కూడా వేలాది మందిభక్తులు జాన్‌పహాడ్ సైదన్నను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దర్గా వద్ద ఉన్న నాగులపుట్ట వద్ద మహిళలు, పాలు, పండ్లు, గుండ్లు ఉంచి పూజలు చేశారు. పుట్ట వద్ద మహిళలు పూనకంతో పానసారం పడుకున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తులు హాజరయ్యారు. ఉర్సు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉర్సుకు వచ్చిన భక్తులు తమ వాహనాలలో వెనుదిరిగి వెళ్లారు.
- న్యూస్‌లైన్, జాన్‌పహాడ్, (నేరేడుచర్ల)
జాన్‌పహాడ్ దర్గా అభివృద్ధికి కృషి
జాన్‌పహాడ్ (నేరేడుచర్ల), న్యూస్‌లైన్ : మతసామరస్యానికి ప్రతీక అయిన జాన్‌పహాడ్ దర్గా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాననివైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన శనివారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకునాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాన్‌పహాడ్ దర్గాను పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. నేరేడుచర్ల- జాన్‌పహాడ్ రోడ్డును డబుల్‌రోడ్డుగా వేయించాలని ఆయన డిమాండ్ చేశారు. దర్గాకు ప్రతి ఏటా లక్షల్లో ఆదాయం వస్తున్నా మౌలిక వసతులు కల్పించడంలో వక్ఫ్‌బోర్డు, ప్రభుత్వం వైఫల్యం చెందాయన్నారు.
అంతకు ముందు ఆయన పూజారి(ముజావర్) మొయినుద్దీన్ ఇంటి వద్ద నుంచి గంధం బిందెను నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. దర్గాలో సైదులుబాబా సమాధులపై దట్టీలు కప్పి గంధం, పూలు చల్లి ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్, హుజూర్‌నగర్ రూరల్ మండలాల కన్వీనర్లు పోరెడ్డి నర్సిరెడ్డి, బోళ్లగాని సైదులు, ఐలా వెంకన్న గౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, నేరేడుచర్ల ఉపసర్పంచ్ పోరెడ్డి వెంకటరమణారెడ్డి, మైనార్టీ సెల్ మండల కన్వీనర్ ఎంఏ గఫార్, నాయకులు జి. మహేందర్‌రెడ్డి, ఉపేందర్, గంధమల్ల పాపయ్య, దేవులపల్లి ఉపేంద్రచారి, పోరెడ్డి రాంరెడ్డి, జ్ఞానయ్య, జార్జ్, కొణతం వెంకటరెడ్డి, షేక్. బాలసైదా, మంగ్తానాయక్, రామచంద్రనాయక్, సోమగాని మధు, పోరెడ్డి అమృతారెడ్డి, ఇంజమూరి పున్నయ్య, క్రిష్టపాటి సత్యనారాయణరెడ్డి, బోగాల చంద్రశేఖర్‌రెడ్డి, కుందూరి మట్టారెడ్డి, కొదమగుండ్ల మట్టయ్య, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్య, పల్లా అంజయ్య పాల్గొన్నారు.
ముగిసిన ఉర్సు
Published Sun, Jan 26 2014 4:27 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement