
సంజీవరాయస్వామికి ప్రత్యేక పూజలు
సంజీవరాయ స్వామి గోవిందా... గోవిందా అంటూ భక్తులు వెల్లాలలో స్వాముల వారిని దర్శించుకున్నారు. మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.స్వాములకు పూజలు చేశారు.
వెల్లాల (రాజుపాళెం):
సంజీవరాయ స్వామి గోవిందా... గోవిందా అంటూ భక్తులు వెల్లాలలో స్వాముల వారిని దర్శించుకున్నారు. మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజామునే స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణం, అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం చేశారు. అనంతనం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేశారు. ధ్యాన మందిరంలో అర్కటవేములకు చెందిన శ్రీమహాలక్ష్మి భజన సంఘం సభ్యులు భక్తులు భజనలు చేశారు.