సంబురంగా సంక్రాంతి
సంక్రాంతి పండుగను జిల్లా అంతటా ప్రజలు ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ రంగవళ్లులు వీధివీధిన వేశారు. గొబ్బెమ్మలు, రేగుపళ్లతో పూజించారు.అందరూ బాగుండాలని నువ్వులు, బెల్లం పంచి పెట్టారు.a
ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సకల సంపదలు, అన్నిశుభాలే కలగాలని కోరుకుంటూ మహిళలు నోములు నోచుకున్నారు. చిన్నారులు మొదలుకొని యువకులు, నడివయస్కులు గాలిపటాలను ఎగురవేశారు. – నిజామాబాద్ కల్చరల్