
వైభవంగా సదర్ ఉత్సవాలు
భిన్న స్కృతులు, విభిన్న ఆచారాలకు ఆలవాలమైన గ్రామాల్లో సదర్ ఉత్సవం ప్రత్యేకమైంది.
అలరించిన దున్నపోతుల విన్యాసాలు..
మహేశ్వరం: భిన్న స్కృతులు, విభిన్న ఆచారాలకు ఆలవాలమైన గ్రామాల్లో సదర్ ఉత్సవం ప్రత్యేకమైంది. సదర్‌ను తెలుగులో చెప్పాలంటే దున్నపోతుల పండుగ అంటారు. దీపావళి పండుగ తర్వాత రోజు జరిగేది దున్నపోతుల పండుగ. మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో సదర్ ఉత్సవాలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా యాదవులు దున్నపోతులను రంగుల చెమ్కీలతో అలంకరించారు. గ్రామంలో గున్నాల యాదవ సంఘం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ గున్నాల చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దున్నపోతుల ఊరేగింపు నిర్వహించారు. యాదవులు దున్నపోతులకు ప్రత్యేక పూజలు చేశారు. యాదవులు ఒకే చోట చేరి తీన్మార్, డప్పు, దరువులు, డీజే స్టెప్‌లతో డ్యాన్సులు చేశారు.
మధ్య మధ్యలోదున్నపోతుల విన్యాసాలు చూపరులను అలరించాయి. పెద్ద త్తున టపాసులు కాల్చి సందడి చేశారు. గ్రామంలో సర్దార్‌పటేల్ యూత్, నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో దున్నపోతులను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జే.లక్ష్మయ్య యాదవ్, ఎంపీటీసీలు లింగం సురేష్, మునగని రాజు, ఉప సర్పంచ్ బోద జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొనమోని మహిపాల్ ముదిరాజ్, రాగనమోని మహేందర్, గున్నాల రవీందర్ యాదవ్, గున్నాల పర్వతాలు యాదవ్, గున్నాల ఇబ్రాహీం యాదవ్, గున్నాల హరికిషన్ యాదవ్, వార్డు సభ్యులు పాండురంగారెడ్డి. పుంటికూర నవీన్‌రెడ్డి, లింగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మంఖాల్‌లో..
మంఖాల్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దున్నపోతులను సుందరంగా అలంకరించి నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తెని కౌలస్య, ఉప సర్పంచ్ కప్పల సుందరయ్య, ఎంపీటీసీ మధు, కాంగ్రెస్ సినియర్ నాయకులు అత్తెని మహేందర్ యాదవ్,మాజీ ఎంపీటీసీ రాములు యాదవ్, యాదవ సంఘం నాయకులు అందెల రాజు, బండ ఆశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.