
చిత్రం విజయం సాధించాలని కోరుకున్నా
పిల్లా నువ్వులేని జీవితం చిత్రం విజయవంతం కావాలని చినవెంకన్నను కోరుకున్నట్టు వర్ధమాన సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మతేజ్ అన్నారు.
‘పిల్లా నువ్వులేని జీవితం’ హీరో సాయి ధర్మతేజ్
ద్వారకాతిరుమల : పిల్లా నువ్వులేని జీవితం చిత్రం విజయవంతం కావాలని చినవెంకన్నను కోరుకున్నట్టు వర్ధమాన సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మతేజ్ అన్నారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. శ్రీవారు, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు.
అనంతరం ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని వీఐపీ లాంజ్‌లో అభిమానులతో ఫొటోలు దిగారు. విలేకరులతో మాట్లాడుతూ ‘రేయ్’ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టినా, రెండో సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదట విడుదల కానుందన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాదిరిగానే తన రెండో సినిమా ముందు విడుదల కావడం యాధృచ్ఛికంగా భావిస్తున్నామన్నారు. ధర్మ
తేజ్‌ను కలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు.