భక్తులకు పూలాజీ బాబా హితబోధ
జైనూర్ : అనంత విశ్వంలో మనమున్నాం.. మనలో విశ్వరూపం దాగి ఉంది.. అదే ఈశ్వర రూపం.. అని సద్గురు పరమహంస పూలాజీ బాబా భక్తులను ఉద్దేశించి హితబోధ చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మండలంలోని పట్నాపూర్ సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై పులాజీ బాబా ఆశీస్సులు పొందారు. మాజీ ఎంపీ రాథోడ్మ్రేశ్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబా ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ధ్యాన కేంద్రంలో భక్తులను ఉద్దేశించి బాబా హితబోధ చేశారు. ప్రతీ ఒక్కరు సన్మార్గంలో నడవాలని, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తే సుఖ జీవితాన్ని అనుభవించవచ్చని వివరించారు. చెడు అలవాట్లు విడనాడినప్పుడే కుటుంబాల్లో సుఖ సంతోషాలు వస్తాయని అన్నారు. స్వార్థ ఆలోచన వీడాలని నిస్వార్థంతో మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు అవుతుందని తెలిపారు. సిద్ధేశ్వర ట్రస్టు డెరైక్టర్ రితీశ్ రాథోడ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మౌళిక సౌకర్యాలు కల్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మాజీ సర్పంచ్ దేవురావు, ఆలయ కమిటీ సభ్యులు ఇంగ్లే కేషవ్, రామారావు, సీఐ రవి, ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు.
మనలోనే ఈశ్వరుడున్నాడు..
Published Wed, Feb 18 2015 3:16 AM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
Advertisement
Advertisement