
ఆదిత్యుని సన్నిధిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ అంతరాలయూనికి ఆమెను తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామి విశిష్టతను వివరించారు. అనెవెట్టి మండపంలో ఆశీర్వదించారు. ఈమె వెంట వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరారుు కళావతి, నాయకులు మండవిల్లి రవి, శిమ్మ వెంకటరావు, విజయలక్ష్మి ఉన్నారు.