
పాము పడగ విప్పడంతో ...
వేలూరు సమీపంలోని పెన్నాతూర్ ఎలై్ల మారియమ్మన్ ఆలయంలో నాగు ఉన్న పలంగా పడగ ఎత్తి ఆడటంతో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు.
వేలూరు: వేలూరు సమీపంలోని పెన్నాతూర్ ఎలై్ల మారియమ్మన్ ఆలయంలో నాగు ఉన్న పలంగా పడగ ఎత్తి ఆడటంతో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయంలో పూజారి సుందరం ఆలయంలో పూజలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆలయంలో ఈనెల 12వ తేదిన 108 పాల బిందెలతో ఊరేగించి అమ్మవారికి అభిషేకం చేశారు.
అనంతరం భక్తులు పాలు తెచ్చిన మట్టి దుత్తను ఆలయంలో ఉంచి బయటకు వచ్చారు. మంగళవారం ఉదయం ఆలయంలోని మట్టి దుత్తలో నాగు పాము ఉన్న ఫలంగా ఉండటాన్ని గమనించిన ఆలయ పూజారి భక్తులకు తెలిపారు. ఈ విషయాన్ని సమీపంలోని గ్రామస్తులందరికీ వ్యాపించింది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వరకు పాము అక్కడ నుంచి వెళ్ళకుండా పడగ విప్పడంతో భక్తులు ఆశక్తిగా చూస్తున్నారు.