
వానరానికి సమాధి
పాపేపల్లెలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన వానరానికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. సమాధి నిర్మించి పూజలు చేశారు.
పెద్దమండ్యం : పాపేపల్లెలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన వానరానికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. సమాధి నిర్మించి పూజలు చేశారు. పది రోజుల క్రితం పాపేపల్లెకు సమీపంలో ఉన్న వానరాల గుంపులో ఒకటి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. అక్కడే కిందపడిపోయి మృతి చెందింది. గ్రామస్తులు చందాలేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం సమాధి నిర్మిం చారు. శనివారం వానర సమాధి వద్ద పల్లె ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు.