
కేతకిలో సినీ ప్రముఖుల సందడి
మెదక్ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కేతకి సంగమేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చిన నిర్మాత శివకుమార్ మల్కపురం, ప్రముఖ దర్శకుడు దశరథ్లకు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు.వారు గర్భగుడిలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం :
కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మాత శివకుమార్, దర్శకుడు దశరథ్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వచ్చే నెలలో మంచు మనోజ్, రేజీనా హీరో హీరోయిన్లుగా సురక్ష బ్యానర్‌పై సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి సినిమా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.