ketaki temple
-
కేతకి ఆలయంలో భారీగా వరద
మెదక్: శుక్రవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మెదక్ జిల్లా ఝరాసంగంలో కేతకి ఆలయంలోకి భారీ వరద చేరుకుంది. నీటితో ప్రధాన ఆలయం నిండిపోయింది. అర్థరాత్రి సమయంలో వర్షం కురవడంతో ఆలయం ముందు భాగంలో ఉన్న దుకాణాలు కొట్టుకుపోయాయి. మరో వైపు జహీరాబాద్ మండలం బొప్పనపల్లి -బోరేగావ్ మధ్య వంతెన తెగిపోయింది. జీర్లపల్లి గ్రామ శివారులో వరద తాకిడికి బ్రిడ్జి కూలింది. అలాగే, సదాశివ్పేట్ పట్టణంతోపాటు మండలవ్యాప్తంగా, కంగ్టి మండలంలో కూడా భారీ వర్షం పడింది. -
తెలంగాణ యువతి-ఆంధ్రా యువకుడి ఆదర్శ వివాహం
ఝరాసంగం రూరల్: మెదక్ జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ జంట ఆదివారం ఆదర్శ వివాహం చేసుకుంది. తెలంగాణకు చెందిన మరుగుజ్జు యువతిని ఆంధ్రాకు చెందిన ఓ యువకుడు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొస్గికి చెందిన వధువు హరిప్రియ (25)కు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వరుడు కె.వెంకట కృష్ణకిశోర్ (32)తో పెళ్లి జరిగింది. హరిప్రియ ఇంటర్, అబ్బాయి ఎంబీఏ చదువు పూర్తి చేశారు. ఆకారం ముఖ్యం కాదని, వ్యక్తిత్వం ప్రధానమని వరుడి తండ్రి కేకేఆర్.పరమేశ్వర్రావు తెలిపారు. స్వామి వారి ఆలయ ప్రధాన మండపం ముందు జరిగిన ఈ వివాహంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. -
కేతకిలో సినీ ప్రముఖుల సందడి
మెదక్ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కేతకి సంగమేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చిన నిర్మాత శివకుమార్ మల్కపురం, ప్రముఖ దర్శకుడు దశరథ్‌లకు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు.వారు గర్భగుడిలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం : కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మాత శివకుమార్, దర్శకుడు దశరథ్‌లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వచ్చే నెలలో మంచు మనోజ్, రేజీనా హీరో హీరోయిన్లుగా సురక్ష బ్యానర్‌పై సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి సినిమా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
కేతకి ఆలయంలో చోరీ
ఝరాసంగం (మెదక్‌జిల్లా): మెదక్ జిల్లాలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు, పూరోహితులు వేదమంత్రోచ్చరణల నడుమ పూజలందుకునే కేతకి సంగమేశ్వర స్వామికే ఆపద వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగలగొట్టి లోపలికి చోరబడి అమ్మవారికి సంబంధించిన బంగారం, వెండి వస్తువులను దొంగలించారు. చోరీ సొత్తు సుమారు రూ. 7 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలోని చోరీలు: జిల్లాలో అతిపెద్ద శివాలయమైన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో గతంలో 1992 అక్టోబర్ 21న శివలింగాన్ని దొంగలించిన సంఘటన అప్పట్లో సంచలనం అయింది. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు పనిచేయక పోయినా.. పాలక మండలి కానీ, ఈవో కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.