తెలంగాణ యువతి-ఆంధ్రా యువకుడి ఆదర్శ వివాహం | tallest man marries smallest woman in medak district | Sakshi
Sakshi News home page

తెలంగాణ యువతి-ఆంధ్రా యువకుడి ఆదర్శ వివాహం

Published Mon, Mar 21 2016 8:33 AM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

తెలంగాణ యువతి-ఆంధ్రా యువకుడి ఆదర్శ వివాహం

తెలంగాణ యువతి-ఆంధ్రా యువకుడి ఆదర్శ వివాహం

ఝరాసంగం రూరల్: మెదక్ జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ జంట ఆదివారం ఆదర్శ వివాహం చేసుకుంది. తెలంగాణకు చెందిన మరుగుజ్జు యువతిని ఆంధ్రాకు చెందిన ఓ యువకుడు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.

మహబూబ్‌నగర్ జిల్లా కొస్గికి చెందిన వధువు హరిప్రియ (25)కు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వరుడు కె.వెంకట కృష్ణకిశోర్ (32)తో పెళ్లి జరిగింది. హరిప్రియ ఇంటర్, అబ్బాయి ఎంబీఏ చదువు పూర్తి చేశారు. ఆకారం ముఖ్యం కాదని, వ్యక్తిత్వం ప్రధానమని వరుడి తండ్రి కేకేఆర్.పరమేశ్వర్‌రావు తెలిపారు. స్వామి వారి ఆలయ ప్రధాన మండపం ముందు జరిగిన ఈ వివాహంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement