కేతకి ఆలయంలో చోరీ | theft in ketaki temple in medak district | Sakshi
Sakshi News home page

కేతకి ఆలయంలో చోరీ

Published Sat, Jan 24 2015 8:02 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

theft in ketaki temple in medak district

ఝరాసంగం (మెదక్‌జిల్లా): మెదక్ జిల్లాలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు, పూరోహితులు వేదమంత్రోచ్చరణల నడుమ పూజలందుకునే కేతకి సంగమేశ్వర స్వామికే ఆపద వచ్చింది.  శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగలగొట్టి లోపలికి చోరబడి అమ్మవారికి సంబంధించిన బంగారం, వెండి వస్తువులను దొంగలించారు. చోరీ సొత్తు సుమారు రూ.  7 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గతంలోని  చోరీలు: జిల్లాలో అతిపెద్ద శివాలయమైన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో గతంలో 1992 అక్టోబర్ 21న శివలింగాన్ని దొంగలించిన సంఘటన అప్పట్లో సంచలనం అయింది.  ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు పనిచేయక పోయినా.. పాలక మండలి కానీ,  ఈవో కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement