director dasarath
-
అలా మొదలైంది!
చిన్నతనం నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇళయరాజా, ఏ.ఆర్. రె హ్మాన్ స్వరాలంటే మరీ’’ అని సంగీత దర్శకుడు వేద అన్నారు. మనోజ్, రెజీనా జంటగా నటించిన ‘శౌర్య’ ద్వారా ఆయన సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ సోదరుడు ఈయన. ‘శౌర్య’ సినిమాకి తనకు అవకాశం దక్కడం గురించీ, ఇతర విశేషాల గురించీ వేద మాట్లాడుతూ - ‘‘ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంగీతం మీద దృష్టి పెట్టలేకపోయాను. పూర్తిగా చదువు మీద ఫోకస్ చేశాను. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ సంస్థలో పని చేశాను. ఆ తర్వాత అనూప్ రూబెన్స్ దగ్గర రాత్రి సమయాల్లో భక్తి పాటలకు పనిచేశా. ఓసారి దేవిశ్రీ ప్రసాద్‌గారికి నా డెమో ఆల్బమ్ పంపిస్తే, ఆయన చెన్నైకు పిలిపించి, అప్రెంటిస్‌గా చేర్చుకున్నారు. నా సినీ సంగీత ప్రయాణం అలా మొదలైంది. ఆ తర్వాత చక్రిగారి దగ్గర వర్క్ చేశాను. దర్శకుడు దశరథ్ తమ్ముడిగా నాకు ‘శౌర్య’ అవకాశం రాలేదు. సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. నేనెవరో చెప్పకుండానే మనోజ్‌గారికి రెండు సిచ్యుయేషన్స్‌కు తగ్గట్టు పాటలు స్వరపరిచి, వినిపించా. అవి నచ్చడంతో ఈ చిత్రానికి మ్యూజిక్ డెరైక్టర్‌గా అవకాశం వచ్చింది’’ అని చెప్పారు. -
నన్ను కొత్తగా చూపించారు
- మనోజ్ ‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఈ కథ నాకు బాగా నచ్చేసింది. నా కెరీర్లోనే డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడు దశరథ్ నన్ను కొత్తగా చూపించారు’’ అని మంచు మనోజ్ చెప్పారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మనోజ్, రెజీనా జంటగా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ‘శౌర్య’ చిత్రం మోషన్ పోస్టర్‌ను హీరో మనోజ్ సతీమణి ప్రణతి ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘త్వరలో చిత్రీకరణ పూర్తవుతుంది. తనకు నచ్చిన అమ్మాయి ప్రేమ కోసం హీరో ఎలా పోరాడాడన్నది చాలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ వేడుకలో కథా నాయిక రెజీనా, సంగీత దర్శకుడు వేదా, నటుడు నందు తదితరులు పాల్గొన్నారు. -
కేతకిలో సినీ ప్రముఖుల సందడి
మెదక్ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కేతకి సంగమేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చిన నిర్మాత శివకుమార్ మల్కపురం, ప్రముఖ దర్శకుడు దశరథ్‌లకు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు.వారు గర్భగుడిలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం : కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మాత శివకుమార్, దర్శకుడు దశరథ్‌లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వచ్చే నెలలో మంచు మనోజ్, రేజీనా హీరో హీరోయిన్లుగా సురక్ష బ్యానర్‌పై సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి సినిమా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.