దర్గా ఉత్సవాలు ప్రారంభం
హాజరైన స్పీకర్ సిరికొండ
పరకాల రూరల్ : హజ్రత్ సయ్యద్ బిస్మిల్లాషావళి దర్గా ఉత్సవాలను ముస్లింలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతులు మహ్మద్‌షఫీ, అహ్మద్‌షా ఖాద్రి, ఉపపీఠాధిపతులు ఇమ్రాన్ రజాఖాద్రి ఇంటి నుంచి 27 దర్గాలకు చెందిన జెండాలతో డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ గంధం పీఠాన్ని స్పీకర్ తలపై పెట్టుకొని పట్టణంలోని దర్గాకు చేరుకున్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, దర్గా గౌరవ అధ్యక్షుడు జాఫర్‌రిజ్వీ, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎంపీ అహ్మద్, వరంగల్ ఆర్డీఓ సురేంద్రకరణ్, పాడి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి పాల్గొన్నారు.
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
రేగొండ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఓ శుభకార్యానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈనెల 23న చెంచుకాలనీలో మెగా దంత, ఆరోగ్య శిబిరం నిర్వహించడానికి బ్రైట్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. వారే ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు. ఆయన వెంట నాయకులు పున్నం రవి, మోడెం ఉమేష్‌గౌడ్, మైస బిక్షపతి, కోలుగురి రాజేశ్వర్‌రావు, గోగుల అశోకరెడ్డి, తడుక శ్రీనివాస్ ఉన్నారు.