Dargah celebrations
-
శాంతి, సామరస్యాలు దేశ సైద్ధాంతిక మూలాలు: మోదీ
జైపూర్: శాంతి, సామరస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన అజ్మీర్‌లోని సూఫీ మతగురువు హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. ప్రధాని తరఫున కేంద్ర మైనా రిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాను సందర్శించి, చాదర్ ను సమర్పించారు. 806వ వార్షిక ఉర్సు సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనుచరులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శాంతి, సామ రస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలు. సూఫీయిజం కూడా భారతీయ తత్వమే. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నంగా సూఫీ తత్వ వేత్త ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ నిలుస్తారు’ అని మోదీ ఆ సందేశంలో పేర్కొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్ దర్గా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో జాన్‌పహాడ్‌గా పేరుగాంచిన అజహరత్ అబ్బాస్ దర్గా ఉత్సవాలకు ముస్తాబవుతోంది.. చింతపల్లి మండలం పీకేమల్లేపల్లిలో కొలువైన ఈ దర్గా 49వ ఉర్సు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, ఖమ్మం, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలిరానున్నారు. దర్గాను దర్శిస్తే శరీరంలోని రుగ్మతులు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. నల్లగొండ, చింతపల్లి : ఓ వైపు ఉర్సు మరో వైపు భక్త మహేశ్వరుడి కల్యా ణం.. అజహరత్ అబ్బాస్ కింది భాగంలో ఉండగా గుట్ట పైభాగంలో శ్రీగిరి భక్త మహేశ్వరస్వామి ఆలయం ఉం టుంది. ప్రస్తుతం ఇక్కడ ఓ వైపు మహేశ్వరస్వామి ఉత్సవాలు, మరో వైపు దర్గాలో ఉర్సు జరగడం ఇక్కడి ప్రత్యేకత. ఇకపోతే హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఈ దర్గా నిలిచిందని చెప్పవచ్చు. గుట్టపై శ్రీ వినాయక స్వా మి, మహేశ్వరస్వామి, ఉమామహేశ్వర దేవి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు నవ విగ్రహాలనూ ప్రతిష్టిం చారు. ఈ ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో అ లంకరించిన 75 అడుగుల ఎత్తు గల మక్క మదీన శివలిం గం నమూనాల అలం కరణలు అమితంగా ఆకర్షిస్తాయి. వెళ్లే మార్గం.. చింతపల్లి మం డలం మాల్, కుర్మేడు, కుర్రం పల్లి, సాయిరెడ్డి, మొద్గులమల్లేపల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. ఉర్సు సందర్భంగా అన్ని రూట్లలో బస్సుల ను ఏర్పాటు చేశారు. 3 రోజులు అన్నదానం ఉంటుంది. హాజరుకాన్ను మంత్రులు, ఐఏఎస్ అధికారులు.. అజహరత్ అబ్బాస్ దర్గా ఉత్సవాల్లో 50ఏళ్ల నుంచి ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఐఏఎస్‌లు తప్పనిసరిగా హాజరుకావడం ఆనవాయితీ. ఉత్సవాలకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, చింతల కనకారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీఎల్పీ నేత జానారెడ్డి, ఐఏఎస్ లు లక్ష్మీపార్ధసారధి, గౌరవ్ ఉప్పల్‌తో పాటు పలువురు అధికారులు ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఉర్సు షెడ్యూల్.. 21 రాత్రి 11 గంటల నుంచి మహమ్మద్ లతీఫ్ సాహెబ్ చే ఒంటెపై గంధం ఊరేగింపు, ఉదయం 8 గంటలకు శ్రీగిరి భక్త మహేశ్వరస్వామి కళ్యాణోత్సవం, 23న భక్తుల దీపారాధన, కందూళ్లు నిర్వహిస్తారు. -
దర్గా ఉత్సవాలు ప్రారంభం
హాజరైన స్పీకర్ సిరికొండ పరకాల రూరల్ : హజ్రత్ సయ్యద్ బిస్మిల్లాషావళి దర్గా ఉత్సవాలను ముస్లింలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతులు మహ్మద్‌షఫీ, అహ్మద్‌షా ఖాద్రి, ఉపపీఠాధిపతులు ఇమ్రాన్ రజాఖాద్రి ఇంటి నుంచి 27 దర్గాలకు చెందిన జెండాలతో డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ గంధం పీఠాన్ని స్పీకర్ తలపై పెట్టుకొని పట్టణంలోని దర్గాకు చేరుకున్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, దర్గా గౌరవ అధ్యక్షుడు జాఫర్‌రిజ్వీ, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎంపీ అహ్మద్, వరంగల్ ఆర్డీఓ సురేంద్రకరణ్, పాడి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి పాల్గొన్నారు. పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం రేగొండ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఓ శుభకార్యానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 23న చెంచుకాలనీలో మెగా దంత, ఆరోగ్య శిబిరం నిర్వహించడానికి బ్రైట్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. వారే ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు. ఆయన వెంట నాయకులు పున్నం రవి, మోడెం ఉమేష్‌గౌడ్, మైస బిక్షపతి, కోలుగురి రాజేశ్వర్‌రావు, గోగుల అశోకరెడ్డి, తడుక శ్రీనివాస్ ఉన్నారు.