ఆలయ పూజల్లో పాల్గొన్న సీఎం సతీమణి | Nara Bhuvaneshwari visit to Shirdi Sai Baba Temple | Sakshi
Sakshi News home page

ఆలయ పూజల్లో పాల్గొన్న సీఎం సతీమణి

Published Fri, Nov 14 2014 3:03 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

ఆలయ పూజల్లో పాల్గొన్న సీఎం సతీమణి - Sakshi

ఆలయ పూజల్లో పాల్గొన్న సీఎం సతీమణి

నక్కపల్లి: సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లు, ఉపమాక వచ్చారు. షిర్డీ సాయి ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఇదేరోజు చంద్రబాబునాయుడు జన్మనక్షత్రం కావడంతో  బాబుగోత్రనామాలతో హోమాలు, పూజలు చేయించారు. గ్రామ ఉపసర్పంచ్ బివి రమేష్‌రాజు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని భువేనేశ్వరి ప్రారంభించారు.

అనంతరం ఆమె ఉపమాక వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రధానార్చకులు వరప్రసాద్ క్షేత్రమహత్యాన్ని వివరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమె పర్యటనలో అనకాపల్లి ఎంపీ ఎం శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంగలపూడి అనిత,జడ్‌పి చైర్‌పర్సన్ లాలం భవానీ,ఎంపిపిలు వినోద్‌రాజు, లావణ్య, జిల్లాగ్రంధాలయసంస్ద మాజీ చైర్మన్ తోటనగేష్, పార్టీ సీనియర్ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, రెడ్డిరామకృష్ణ, బాబ్జిరాజు, మీగడసత్తిబాబు, కురందాసు నూకరాజు, కానీనాయుడు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపిటీసి ఈశ్వరరావు,ఆర్‌డివో సూర్యారావు, ప్రత్యేకాధికారి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement