భువనేశ్వరి పేరుతో ఆడియో హల్‌చల్
పోరా.. పో ఇక్కడ నుంచి.. లం.. కొడకా..
పెద్ద కుటుంబంలో పుట్టినదాన్ని నేను..
పత్రికల్లో రాయడానికి వీలు లేనంత అసభ్యంగా కొన్ని పదాలు
36 గంటలుగా వివిధ సోషల్ మీడియా వేదికల్లో వైరల్
ఎప్పుడు, ఎవరిపై ఇలా ఆగ్రహంతో ఊగిపోయారన్న దానిపై విస్తృతంగా చర్చ
టికెట్ కోసం వచ్చిన దళిత నాయకుడిపై మాట్లాడారని కొందరు.. కుప్పం స్టీరింగ్ కమిటీ సభ్యులపై అనిమరికొందరు..
కొన్ని సామాజిక వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు
తప్పు పడుతున్న వివిధ కుల సంఘాల నాయకులు
చంద్రబాబు కుటుంబ సభ్యుల తీరే అంతంటూ రాజకీయ వర్గాల్లో చర్చ
సాక్షి, అమరావతి
పోరా.. పో ఇక్కడ నుంచి లం..కొడకా..
నేను నీకంటే పెద్ద ఇంటిలో పుట్టిన దాన్ని. చెత్త నా కొడుకులు. చెత్త బుట్టలో పుట్టి కూడా వేషాలు వేస్తారు.
దేనికీ పనికిరారు.. అడుక్కు తింటానికి కూడా.. బాస్టర్డ్. మీ అందరినీ మానిటర్ చేయలేక (పర్యవేక్షించలేక) నేను చస్తున్నా..
తప్పుడు నా కొడకా, ఊడిగం చేసే కుక్క..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తిట్ల దండకంతో కూడిన ఆడియో ఒకటి గురువారం రాత్రి నుంచి వివిధ సోషల్ మీడియా వేదికల్లో హల్‌చల్ చేస్తోంది. కేవలం ఒక్క భువనేశ్వరి మాటలు మాత్రమే ఆ ఆడియో టేపుల్లో వినిపిస్తోంది. అందులో కొన్ని పదాలు పత్రికలో రాయడానికి వీలు లేనంత అసభ్యంగా ఉన్నాయి. ఆమె ఎప్పుడు, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న దానిపై అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు, ఇటు రాష్ట్రంలోని రాజకీయ వర్గాలందరిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో భర్త నామినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఆమె ఈ నెల 18, 19, 20 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలో.. కొందరు స్థానిక టీడీపీ నాయకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన మాటలుగా టీడీపీలో చర్చ సాగుతోంది. ‘కుప్పంలో లోకేశ్ తన సొంత మనుషులతో ఓ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ సభ్యులు కొందరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదని చెప్పారు. ఆ పరిస్థితిని మార్చడంలో భాగంగా ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా అయిన ఖర్చుకు సంబంధించి బిల్లులు పెట్టిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు’ అని కుప్పం టీడీపీ నాయకులు చెబుతున్నారు. కాగా, మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తూ.. చంద్రబాబు కుటుంబ సభ్యులందరితో పరిచయం ఉన్న ఓ దళిత నాయకుడు ప్రస్తుత ఎన్నికల్లో తన టికెట్ కోసం భువనేశ్వరిని కలిసి సిఫార్సు కోసం ప్రయతి్నంచినప్పుడు ఆమె ఈ రకంగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారన్న చర్చ కూడా సాగుతోంది. అయితే భువనేశ్వరి మాటలతో కూడిన ఆ ఆడియో టేపుల్లోని మాటలు సమాజంలో కొన్ని వర్గాల వారిని బాగా కించ పరిచేలా ఉండడంతో వివిధ కుల సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment