
సాక్షి,అమరావతి : సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి హాజరైన ఈవెంట్‌కి కూటమి ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు పెట్టింది. మహిళ సాధికారత పేరుతో పర్యాటక శాఖ భవాని ద్వీపంలో నిర్వహించిన శక్తి విజయోత్సవ్‌కి నారా భువనేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు .
అయితే ఈ ఈవెంట్‌కు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.మొదట రూ.2 కోట్లకి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తర్వాత మరో రూ.5 కోట్లుకి అనుమతి తెలిపింది ప్రభుత్వం. చంద్రబాబు భార్య కావడంతో ప్రభుత్వం అడిగినంత మంజూరు చేసింది. భువనేశ్వరి వచ్చిన ఈవెంట్‌కు రూ.7కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
