భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పుష్యమాసం ఉత్సవాల వివరాలను ఆలయ ప్రధానార్చకులు ఆదివారం వెల్లడించారు.
14వ తేదీన భోగి సందర్భంగా గోదా కల్యాణం, 15న మకర సంక్రాంతి రోజున రథోత్సవం, చుట్టు సేవ, స్వామివారికి ప్రణయ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 16న కనుమ, ఆండాలమ్మ వారికి తిరువీధి సేవ, 23 పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి తిరువీధి సేవ, మండప సేవ చేస్తారు. 24న పుష్యమి నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం, 25 నుంచి 29 వరకు శ్రీ కూరత్తాళ్వార్‌కు తిరు నక్షత్రోత్సవాలు జరపనున్నారు.
26న శ్రీ తిరుమలీశై ఆళ్వార్ తిరు నక్షత్రం ఆళ్వారుకు విశేష భోగం, 29న ఆళ్వారుకు చుట్టు సేవ, విశేష భోగం, నివేదన, ప్రబంధారంభము నిర్వహిస్తారు. 30న చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన యాగం, హోమం, ఫిబ్రవరి 4న సర్వేషా ఏకాదశిని పురస్కరించుకొని లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ప్రధానార్చకులు తెలిపారు.