
నితిన్, సినీహీరో ,అక్క నిఖితారెడ్డి
షూటింగ్ నిమిత్తం ఎక్కడ ఉన్నా సరే.. రాఖీ పండగ రోజు మాత్రం ఖచ్చితంగా మా అక్క నిఖితారెడ్డి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుంటాను. మా అక్కకి నేనంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. అందరి అక్కలకు తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది. కానీ మా అక్కది కొంచెం ఎక్కువ ప్రేమ. ఆమె రాఖీ కట్టగానే నేను ఏదో ఒక గిప్ట్ ఇస్తాను. ఇప్పుడు హీరోగా రేంజ్‌పెరిగింది కాబట్టి గిప్ట్ రేంజ్ కూడా పెరుగుతుంది. తమ్ముడిగా ఏం ఇవ్వకపోయినా ఆమె హ్యాపీగానే ఉంటుంది.. కానీ నాకే ఆమెకు ఏమన్నా మంచి గిప్ట్ ఇవ్వాలని పిచ్చి. ఈ రోజంతామా అక్కతోనే ఉంటాను.
Comments
Please login to add a commentAdd a comment