
రాఖీ పౌర్ణమి వేడుకలు టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ బహ్రయిన్లో ఘనంగా నిర్వహించింది. మనామా కృష్ణ మందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన బహ్రయిన్ టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్‌లు మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధమే రక్షాబంధన్ అని అన్నారు.
రాఖీతో పాటు సోదరులకు హెల్మెట్లను గిఫ్ట్‌గా ఇచ్చి వారికి రక్షణగా నిలవాలనే 'సిస్టర్స్ 4 ఛేంజ్' గొప్ప కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమానికి నాంది పలికిన నిజామాబాద్ ఎంపీ కవిత ప్రయత్నానికి తాము మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవి పటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు గంగాధర్ గుమ్ముల, రాజేందర్ మగ్గిడి, విజయ్, కిరణ్, నర్సయ్య, దేవ్ యాదవ్‌లు తదితరులు పాల్గొన్నారు.