
రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతున్న సునీతారావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌లో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నేతలు నీలం పద్మ, వరలక్ష్మి, గోగుల సరిత తదితరులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ములుగు ఎమ్మెల్యే సీతక్క జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మంజులారెడ్డి తదితరులు కూడా రేవంత్‌కు ఆయన నివాసంలో రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలందరికీ కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా అండగా ఉంటుందని, మహిళా సమస్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment