
సుఖసంతోషాలతో జీవించాలి: గట్టు
లోటస్‌పాండ్‌లో ఘనంగా రాఖీ పండుగ
సాక్షి, హైదరాబాద్: అక్కాచెల్లెళ్లందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృత సాగర్ రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లందరికి శ్రీకాంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ, ప్రధాన కార్యదర్శులు పుష్పలత, ఇందిరారెడ్డి, వనజ, కార్యదర్శులు విరాణిరెడ్డి, నేహ, ఇందిర, గీతారెడ్డి, రమా, పర్వతరెడ్డి బాలకృష్ణారెడ్డి, కె.కేసరి సాగర్ పాల్గొన్నారు.