కుత్బుల్లాపూర్: రాఖీ పండక్కి పుట్టింటికి వెళ్లొద్దని భర్త అనడంతో మనస్తాపం చెంది ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల ఎస్సై సైదిరెడ్డి కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జితేందర్ సింగ్ బౌరంపేటలోని ఎస్‌బీహెచ్ బ్రాంచిలో క్యాషియర్‌గా పని చేస్తూ సుభాష్‌నగర్‌లో ఉంటున్నారు. బుధవారం ఉదయం భార్య ప్రతిమా సింగ్ రాఖీ పౌర్ణమికి స్వగ్రామానికి వెళ్దామని భర్తను కోరగా.. నెల క్రితమే వెళ్లొచ్చాం.. ఇప్పుడెందుకని చెప్పి విధులకు వెళ్లాడు. సాయంత్రం ఫోన్ చేస్తే ప్రతిమ స్పందించలేదు. దీంతో భర్త ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.