
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మంత్రి విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం బుధవారం ట్వీట్ చేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: నాణేనికి అటు.. ఢిల్లీలో చంద్రబాబు డ్రామా!
ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను!
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2023
Comments
Please login to add a commentAdd a comment