రాజుతండాలో వీరజవాన్ విగ్రహానికి రాఖీ కడుతున్న అక్కాచెల్లెళ్లు
సాక్షి, హుస్నాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ ఈ పండుగ రోజు తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి ఆశీర్వదిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయితే తన సోదరుడు చనిపోయిన అతని విగ్రహానికి రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో చాటి చెబుతున్నారు.
ఏటా జ్ఞాపకార్థం..
అక్కన్నపేట మండలంలోని దుబ్బతండా గ్రామ పంచాయితీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు నరసింహనాయక్‌కు ముగ్గురు అక్కలు ఉన్నారు.అతడు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తూ 2014లో నక్సల్స్ మందుపాతరలో మృతి చెందాడు.అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లింగయ్యనాయక్ సత్తవ్వ తమ వ్యవసాయ పొలంలో విగ్రహాని ఏర్పాటు చేశారు. ఒక్కగానొక్క సోదరుడు చనిపోవడంతో తాము రాఖీ ఎవరికి కట్టాలని అతని సోదరీమణులు విగ్రహంలోనే తమ తమ్ముడుని చూసుకుంటున్నారు. ఏటా రాఖీ పండుగా రోజు విగ్రహానికి రాఖీ కట్టా పండుగా జరుపుకొంటారు.అలాగే కాకుండా ప్రతి ఏటా స్వాతంత్ర,గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నరసింహ నాయక్ విగ్రహాం ఎదుట జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment