Akkannapeta
-
సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్
సాక్షి, సిద్దిపేట: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు నష్టపరిహారం కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టడం.. విద్యుత్ సరఫరా నిలిపివేసి, పలువురిని అరెస్టు చేయడం.. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జీతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనితో నిర్వాసితులు ఆందోళనను మరింత ముమ్మరం చేశారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గూడాటిపల్లిలో 8.23 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాజెక్టు కాల్వ నిర్మాణం కోసం సర్వే పనులు జరుగుతున్నాయి. అయితే తమకు పూర్తి పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలంటూ నిర్వాసితులు రెండు రోజులుగా పనులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు గూడాటిపల్లిలో మోహరించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇళ్లలోని నిర్వాసితులను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మహిళలు, కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీకి దిగి చెదరగొట్టడంతో.. పలువురికి గాయాలయ్యాయి. పాదయాత్రగా హుస్నాబాద్‌కు.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు గూడాటిపల్లి నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. హుస్నాబాద్ ఎల్లమ్మ గుడివద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు దిగివచ్చి అనుమతి ఇవ్వడంతో నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి నిర్వాసితులతో మాట్లాడారు. అరెస్టైన వారిని విడుదల చేయించారు. పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నిర్వాసితులు వెనక్కి తగ్గలేదు. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు నిరసన చేపట్టారు. అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం హుస్నాబాద్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. పోలీసులు క్షమాపణ చెప్పాల్సిందే: సీపీఐ నారాయణ భూనిర్వాసితులపై లాఠీచార్జీ చేసిన పోలీసు లు క్షమాపణ చెప్పాలని, వారిని వెంటనే స స్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆ ధ్వర్యంలో సోమవారం హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భం గా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాకలో నిర్వాసితులకు చెల్లించినట్టు గా గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేసిన పా పాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం జాతీ య స్థాయికి వెళ్తున్నారని మండిపడ్డారు. దాడి క్షమించరానిది: రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డ వారికి సరైన పరిహారం ఇవ్వాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ నిర్వాకంతో నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా పరిహార ప్యాకేజీ అమలు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకో ఎకరం డబ్బులు రావాలి గౌరవెల్లిలో 5 ఎకరాల భూమి కోల్పోయాను. 4 ఎకరాలకు సంబంధించిన డబ్బులే చెల్లించారు. ఇంకా ఎకరం డబ్బులివ్వాలి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద స్థలమిస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించాకే ప్రాజెక్టు పనులు చేయాలి. – భూక్యా స్వప్న, సేవగాని తండా భూమికి భూమి ఇవ్వాలి గౌరవెల్లి రిజర్వాయర్ కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమి సేకరించారు. అందులో 88 ఎకరాలకు సంబంధించిన రైతులు సంతకాలు చేయలేదు. కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతున్నాం. మల్లన్నసాగర్ నిర్వాసితులతో సమానంగా మాకూ నష్టపరిహారం చెల్లించాలి. – బద్దం ఎల్లారెడ్డి, గూడాటిపల్లి -
మతిస్థిమితం లేకనే చంపేసింది
అక్కన్నపేట(హుస్నాబాద్): తల్లికి మతిస్థిమితం సరిగా లేకనే కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపిందని అడిషనల్ ఎస్పీ సందేపోగు మహేందర్ అన్నారు. అక్కన్నపేట మండలం మల్‌చెర్వుతండాలో తొమ్మిదేళ్ల ‘కూతురునే కడతేర్చిన కన్నతల్లి’ జరిగిన దారుణ సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం హుస్నాబాద్‌లోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లి మమత అలియాస్ రాణిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన వివరాలు వెల్లడించారు. భూక్య తిరుపతి, మమత దంపతుల పెద్ద కూతురు భూక్య సోని(09) వంట చేసేందుకు ఇంట్లో బియ్యం తీస్తున్న క్రమంలో కోపోద్రికురాలై తల్లి రోకలిబండతో కూతురి తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిందన్నారు. తల్లికి సరిగ్గా మతిస్థిమితం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని విచారణలో తెలిందన్నారు. ఈ సమావేశంలో సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి, ఎస్సై కొత్తపల్లి రవి పాల్గొన్నారు. -
ప్రతీకారంతోనే కాల్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపి న అక్కన్నపేట కాల్పుల ఘటనపై రిమాండ్ రిపో ర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితుడు గంగరాజు తనను అవమానించాడని, అతడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే అతని ఇంటిపై ఏకే–47 లక్ష్యంగా కాల్పులు జరిపాడని రిపోర్టులో పేర్కొన్నారు. గంగరాజు ఫి ర్యాదుతో నిందితుడిపై ఐపీసీ 307, ఆయుధాల చట్టం సెక్షన్ 25 (1), 27 ప్రకారం కేసులు న మోదు చేశారు. అయితే తుపాకుల అదృశ్యం పై రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశా లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రిపోర్టులో ఏముందంటే.. అక్కన్నపేట పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉండే గుంటి గంగరాజు, దేవుని సదానందంలు బంధువులు. ఈనెల 5న గంగరాజు తల్లి ఎల్లవ్వ, సదానందం భార్య కృష్ణవేణి.. సిమెంటు ఇటుకల విషయమై గొడవ పడ్డారు. ఇది తెలుసుకున్న గంగరాజు, అతని సో దరుడు అశోక్‌తో కలసి సదానందం ఇంటికి వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో సదానందం, అతని భార్య కృష్ణవేణి, ఆమె మేనమామ గుంటి వెంకట య్య.. గంగరాజు సోదరుల మధ్య వాగ్వాదం జరి గింది. ఈ క్రమంలో సదానందం ఫోన్ లాక్కున్న గంగరాజు..నీ భార్యని కూడా ఇలాగే లాక్కెళతా.. దిక్కున్నచోట చెప్పుకో! అని వెళ్లిపోయాడు. దీన్ని అవమానం గా భావించిన సదానం దం ఎలాగైనా గంగరాజు పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తాను గతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో దొంగిలించిన ఏకే–47తో అతనిని మట్టుబెట్టాలనుకున్నాడు. ఆయుధాన్ని ఇంటి స మీపంలోని బస్వాపూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి పనిచేస్తుందో లేదో సరిచూసుకున్నాడు. పనిచేయకపోవడంతో అక్కడే దానికి ఆయిల్ పోసి ఇంటికి తెచ్చాడు. అదేరోజు రాత్రి 9 గంటలకు తన ఇంటి వాకిట్లో కొన్ని రౌండ్లు కాల్చి పనిచేస్తుందని నిర్ధారించుకున్నాడు. ఈ శబ్దాలు విని బయటికి వచ్చిన పొరుగింటి వ్యక్తి కేశబోయిన దిలీప్‌కు గంగరాజు ఇంటివైపు తుపాకీ తీసుకుని వెళ్తున్న సదానందం కన్పించాడు. అతను వెంటనే అశోక్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన బాధిత కుటుంబ సభ్యులు ఇంటికి గడియపెట్టారు. ఇంటికి తలుపులు పెట్టి ఉండటంతో సదానందం తెరిచి ఉన్న కిటికీ నుంచి గంగరాజును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. అంతా నేలపై పడుకోవడంతో అవి గురితప్పాయి. ఈలోగా ఇరుగుపొరుగు రావడంతో సదానందం అక్కడ నుంచి గోడదూకి పారిపోయాడు. రాత్రంతా పక్కనే ఉన్న బొడిగేపల్లిలోని ఓ చింతచెట్టుకింద తలదాచుకున్నాడు. మర్నాడు ఉదయం కోహెడ్ బస్టాప్‌కు లిఫ్ట్ అడిగి వెళ్లాడు. అక్కడ చేతిలో సంచితో అనుమానాస్పదంగా ఉన్న సదానందంను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి ఏకే 47 రైఫిల్ బట్ నం కేఆర్ 85. ఆర్సెనెల్ నం. ఏఎన్ 0815.. 25 లై వ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుంచి స్టేషన్‌కు తరలించారు. అతడిచ్చిన సమాచారం తో ఇంట్లో ప్లాస్టిక్ పైపులో దాచిన కార్బన్ వెపన్ బట్ నం. కేఆర్ 122, ఆర్సెనల్ నం.16077508 గా గుర్తించారు. విచారణలో ఏం చెప్పాడంటే..: 2014లో మొదటి భార్యతో విడిపోయాక సదానందం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు కృష్ణవేణికి రూ.2 లక్షల క న్యాశుల్కం చెల్లించాడు. ఇందులో రూ.లక్ష నగ దును అధిక వడ్డీకి ఆశపడి కృష్ణవేణి బంధువైన గొట్టె కొమురవ్వకు అప్పుగా ఇచ్చారు. ఆమె బాకీని తిరిగి ఇవ్వకపోవటంతో 2016లో హుస్నాబాద్ ఠాణాలో ఆమెపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పు పత్రం అడిగారు. దీంతో సదానందం నకిలీ పత్రం సృష్టించి తీసుకొచ్చాడు. అసలు పత్రంతో కొమురవ్వ స్టేషన్‌కి వచ్చింది. ఇద్దరూ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన క్రమంలో కొమురవ్వ వద్ద అప్పు అసలు పత్రం, రూ.లక్ష నగదు ఉన్న సంచిని దొంగిలించాడని ఆరోపిస్తూ ఆమె తన బంధువులతో కలసి సదానందంను అతని ఇంటిలోనే చితకబాదింది. దీంతో వీరిపై ఫిర్యాదు చేసేందుకు హుస్నాబాద్ ఠాణాకు సదానందం వెళ్లాడు. అప్పుడే.. తనపై దాడి చేసిన వారిపై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఠాణా నుంచి తుపాకులను దొంగిలించాడు. కానీ, కృష్ణవేణి జోక్యంతో కొమురవ్వ డబ్బులివ్వడంతో వివాదం సమసిపోయింది. అయితే, అప్పటి నుంచి ఆ తుపాకులను తన వద్దే పెట్టుకున్నాడు. ఈ ప్రశ్నలకు బదులేది..? ఆయుధాల అదృశ్యం కేసులో పోలీసుల తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఏకే–47 వెపన్, 30 లైవ్‌రౌండ్లు మిస్సయినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. దాన్ని కనిపెట్టేందుకు సరిగా దర్యాప్తు చేయకపోవడం కూడా గమనార్హం. - రిమాండ్ రిపోర్టులో వెపన్ ఏ తేదీన మిస్సయిన సంగతి ఎందుకు వెల్లడించలేదు? - 9 ఎంఎం కార్బన్ కూడా తన వద్దే ఉందని నాలుగేళ్ల తరువాత సదానందం చెబితేగానీ పోలీసులు తెలుసుకోలేకపోయారు. - ఇంతకాలం కార్బన్ వెపన్ ఉందని రికార్డుల్లో ఎలా చూపారు? - సిద్ధిపేట కమిషనరేట్‌లో హుస్నాబాద్ ఠాణా విలీనం అవుతున్న సమయంలో ఆయుధాల లెక్కింపు జరిగింది. ఏకే–47 రైఫిల్ మిస్సయిన విషయాన్ని గుర్తించిన అధికారులు కార్బన్ పిస్టల్ విషయం ఎందుకు గుర్తించలేక పోయారు? అంటే హుస్నాబాద్ సిబ్బంది అందుబాటులో ఉన్న కార్బన్‌ను రెండుసార్లు లెక్క చూపించారా? - కార్బన్వెపన్ మిస్సింగ్‌పై పోలీసులు ఇప్పటికీ ఎఫ్.ఐ.ఆర్ ఎందుకు నమోదు చేయడం లేదు? - కార్బన్వెపన్ మిస్సింగ్ విషయాన్ని కమిషనరేట్ అధికారులకు తెలియనివ్వకుండా నాలుగేళ్లపాటు ఎలా కప్పిపుచ్చగలిగారు? - ఏకే–47 వెపన్ పోయినందుకు నరేందర్ అనే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్న అధికారులు కార్బన్ వెపన్ మాయం విషయంలో ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్
సాక్షి, అక్కన్నపేట: గిరిజన విద్యార్థుల మాతృ భాషపై కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆంక్షలు విధిస్తున్నాడు. ఆ భాషలో మాట్లాడితే జరిమానా చెల్లించాలంటూ ఎస్ఓ హుకుం జారీ చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో ఇది జరుగుతోంది. అకౌంటెంట్ ఉన్నప్పటికీ అన్నీ వ్యవహారాలు ఎస్ఓ చేతి మీదుగా సాగుతున్నాయని, నిధుల దుర్వినియోగంతో పాటు ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్న చందంగా పరిస్థితి తయారైందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎస్ఓ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. సోమవారం అక్కన్నపేట మండల ఎంపీపీ మాలోతు లక్ష్మి కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని తెలుసుకున్నారు. కాగా, తరగతి గదిలో ‘గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్’వేస్తున్నారని ఓ గిరిజన విద్యార్థిని తెలిపింది. ఎంపీపీ మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకోవడానికి విద్యార్థులు భయపడుతున్నారని, గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్ విధించడాన్ని తప్పుపట్టారు. -
కాపురానికి తీసుకెళ్లాలని ఆందోళన
సాక్షి, హుస్నాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాపురం సజావుగా సాగుతోంది. ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అనంతరం కట్నం తీసుకురావాలని భర్త ఇంటి వారు వేధించడం మొదలు పెట్టారు. కట్నం తెస్తేనే కాపురానికి రావాలని ఇంటికి పంపించారు. దీంతో దిక్కుతోచని ఆ అభాగ్యురాలు కాపురానికి తీసుకెళ్లాలని అత్తగారి ఇంటి ఎదుట బైఠాయించింది. అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామంలో భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని అత్తగారి ఇంటి ఎందుట భార్య తన ఇద్దరు ఆడ పిల్లలతో బైఠాయించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇంటి బయట ఇద్దరు పిల్లలతో భారతి స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇవి.. మంచిర్యాల జిల్లా, కౌటపల్లి మండలం, రోయ్యలపల్లి గ్రామానికి చెందిన భారతి అనే యువతికి మండలంలోని గౌరవెల్లి గ్రామానికి చెందిన మజ్జిగ రంజిత్‌తో 2015లో జనగామ జిల్లా హనుమాన్ గుడిలో పెళ్లి జరిగింది. నాలుగేళ్ల క్రితం ఫేక్‌బుక్, వాట్సాప్‌లో పరిచయం ఏర్పండి అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఎదురించి పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్నాళ్లపాటు కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తరువాత రూ.20లక్షలు కట్నం తీసుకొనిరావాలని ఇబ్బందులకు గురి చేస్తూ హింసింస్తున్నారని భారతి వాపోయింది. కాపురానికి తీసుకెళ్లడం లేదని, తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని తన భర్త ఇంటి మందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న అత్తామామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంటోంది భారతి. గ్రామంలోని మహిళలు కూడా భారతికి మద్దతుగా నిలిచారు. -
జవాన్ విగ్రహానికి రాఖీ
సాక్షి, హుస్నాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ ఈ పండుగ రోజు తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి ఆశీర్వదిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయితే తన సోదరుడు చనిపోయిన అతని విగ్రహానికి రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో చాటి చెబుతున్నారు. ఏటా జ్ఞాపకార్థం.. అక్కన్నపేట మండలంలోని దుబ్బతండా గ్రామ పంచాయితీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు నరసింహనాయక్‌కు ముగ్గురు అక్కలు ఉన్నారు.అతడు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తూ 2014లో నక్సల్స్ మందుపాతరలో మృతి చెందాడు.అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లింగయ్యనాయక్ సత్తవ్వ తమ వ్యవసాయ పొలంలో విగ్రహాని ఏర్పాటు చేశారు. ఒక్కగానొక్క సోదరుడు చనిపోవడంతో తాము రాఖీ ఎవరికి కట్టాలని అతని సోదరీమణులు విగ్రహంలోనే తమ తమ్ముడుని చూసుకుంటున్నారు. ఏటా రాఖీ పండుగా రోజు విగ్రహానికి రాఖీ కట్టా పండుగా జరుపుకొంటారు.అలాగే కాకుండా ప్రతి ఏటా స్వాతంత్ర,గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నరసింహ నాయక్ విగ్రహాం ఎదుట జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటి చెబుతున్నారు. -
గ్రామాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు
రామాయంపేట: మండలంలోని పర్వతాపూర్, కాట్రియాల తొనిగండ్ల, ఝాన్సిలింగాపూర్, అక్కన్నపేట గ్రామాల్లో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈసందర్భంగా పార్టీ మండల నాయకుడు కాముని లక్ష్మినర్సింలు ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్టీ సెల్ మండలశాఖ అధ్యక్షుడు నాన్య నాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.