![గ్రామాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81480958358_625x300.jpg.webp?itok=j0a6tj_s)
గ్రామాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు
రామాయంపేట: మండలంలోని పర్వతాపూర్, కాట్రియాల తొనిగండ్ల, ఝాన్సిలింగాపూర్, అక్కన్నపేట గ్రామాల్లో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు చేపట్టారు.
ఈసందర్భంగా పార్టీ మండల నాయకుడు కాముని లక్ష్మినర్సింలు ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్టీ సెల్ మండలశాఖ అధ్యక్షుడు నాన్య నాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.