
నేడు రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెలు.. అక్కా తమ్ముడు ఇలా తమ అను బంధాన్ని తెలుపుతూ రాఖీ కట్టడం సహజం. ఒకే ఇంట్లో పుట్టి ఆపై ఊహ తెలిసింది మొదలు ఆటపాటలతో కలిసి పెరుగుతారు. అలా కాలం గడిచేకొద్ది పెళ్లిళ్లయ్యి ఎవరి దారిన వారెళ్లినా. ఎవరికి నచ్చిన ప్రపంచంలో వారు ఉన్నా రక్తసంబంధం మధ్య ఉండే ఆ ప్రేమ అంతే తియ్యందనం పంచుతుంది. కొండంత ఆలంబన అందిస్తుంది.
ఇలా తన అన్నయ్య అయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని సాక్షి ఛానల్‌తో విజయ లక్ష్మీ పంచుకున్నారు. రామూ కూడా సెంటిమెంట్లు ఫాలో అవుతారని ఆమె చెప్పారు. ఒక అన్నగా తమకు చాలా రక్షణగా ఉంటరాని విజయ తెలిపారు. రామూతో పాటు తన తమ్ముడు అయిన కోటికి కూడా రాఖీ కడుతానని ఆమె చెప్పారు.
(ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..)
చిన్నప్పడు రామూకు రాఖీ కట్టినప్పుడు ఏం జరిగింది.. ఇప్పుడు రాఖీ కట్టేందుకు వెళ్తే వర్మ ఏం అన్నారు.. తిరిగి చెల్లెలు కోసం ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు.. చెల్లెలు కష్టాల్లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సాయం చేశారు.. వంటి విషయాలు ఈ పూర్తి వీడియోలో తెలుసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment