బిగ్బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.
(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)
కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించారు.
పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.
(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్')
Comments
Please login to add a commentAdd a comment