సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మందిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.ఆరు ప్రత్యేక బృందాలతో హైటెక్ నేరగాళ్ల కోసం చేసి గాలింపు చేపట్టారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా 18 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు ఆరెస్టు చేశారు.వీరిపై తెలంగాణలో 45కుపైగా సైబర్ క్రైమ్ కేసులు ఉండగా దేశవ్యాప్తంగా 319 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు,26సెల్‌ఫోన్లు,16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
సెక్స్‌టార్షన్,పెట్టుబడులు, కొరియర్ పేరుతో వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. తెలంగాణలో ఈ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.6.94 కోట్లు సైబర్ నేరాల ద్వారా కాజేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: పోలీసులే షాక్ అయ్యేలా.. విశాఖ హానీ ట్రాప్ కేసులో
Comments
Please login to add a commentAdd a comment