ఘోర ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి | Bike Skid Laeds To Lost Life Of One Person In Nallakunta-vidhya Nagar | Sakshi
Sakshi News home page

నల్లకుంటలో ఘోర ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి

Aug 11 2020 11:18 AM | Updated on Aug 11 2020 12:44 PM

Bike Skid Laeds To Lost Life Of One Person In Nallakunta-vidhya Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని విద్యానగర్‌- నల్లకుంట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సౌత్‌ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఎండ్రిక్‌ హఠన్‌(23) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఎండ్రిక్‌ విద్యానగర్‌ నుంచి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళ సభ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బైక్‌పై అధిక వేగంతో వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో అధిక వేగంతో డివైడర్‌ను డీకొని స్తంభానికి బలంగా డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement