Student Missing Case: 7th Class Student Goes Missing After Father Asks School Diary - Sakshi
Sakshi News home page

School Diary: నల్లకుంటలో విద్యార్థి అదృశ్యం.. తండ్రి మందలించడంతో పాల ప్యాకెట్‌ కోసమని వెళ్లి..

Published Sat, Feb 19 2022 9:18 AM | Last Updated on Sat, Feb 19 2022 1:13 PM

7th Class student Goes Missing After Father Asks School Diary - Sakshi

Son Goes Missing After Father Asks School Diary: స్కూల్‌ డైరీ చూపించలేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన బాలుడు అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ మొగిలిచర్ల రవి తెలిపిన వివరాల మేరకు.. అవగాన్‌ అజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి విద్యానగర్‌ మణిసదన్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. స్థానిక నారాయణ స్కూల్‌లో ఏడవ తరగతి చదువున్న కుమారుడు అవగాన్‌ కార్తీక్‌కుమార్‌ గత కొద్ది రోజులుగా తన స్కూల్‌ డైరీని చూపించడం లేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రి మందలించాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాల ప్యాకెట్‌ తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కార్తీక్‌ సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కుమారుడి ఆచూకి కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో అజయ్‌కుమార్‌ శుక్రవారం సాయంత్రం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకి తెలిస్తే మొబైల్‌: 9490616373 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
చదవండి: ఐటీ బాట పట్టిన హైదరాబాద్‌: కొత్తగా వందలాది కంపెనీలు.. వేలాదీ కొలువులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement