Nallakunta
-
Hyderabad: హిట్ అండ్ రన్ కేసు నమోదు
నల్లకుంట: మద్యం మత్తులో కారు నడిపి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వీరంగం సృష్టించిన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన యడవల్లి శ్రీనివాస్ సీతారమేష్(46)టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 18న రాత్రి అతను బైక్‌పై విద్యానగర్ లక్కీ కేఫ్ సమీపంలోని ఐరావత్ ఐ క్లినిక్ రోడ్డులో వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకువచి్చన కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టడంతో రమేష్ కిందపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు రమేష్ ఈ నెల 19న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రమాదేవి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు కారును అడ్డుకుని కారు నడుపుతున్న వ్యక్తిని నిలదీస్తూ సెల్ ఫోన్లో వీడియో తీశారు. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.కారు కుడివైపు ముందు డోర్ పక్కన బీరు బాటిల్ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. కాగా ఘటన జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి పక్కన ఓ చిన్నారి కూడా ఉండటం గమనార్హం. -
Hyderabad: ప్రాణం తీసిన వేగం.. ఇద్దరు బీబీఏ విద్యార్థుల దుర్మరణం
సాక్షి, హైదరాబాద్(నల్లకుంట): అతి వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకుల డివైడర్‌ను ఢీకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారు జామున నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లకుంట ఎస్హెచ్ఓ రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన నస్కంటి రాజు గౌడ్ కుమారుడు నస్కంటి భవన్(20), నిర్మల్ జిల్లాకు చెందిన మాలేపు రోషన్(20) రాంనగర్‌లోని సన్ డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతూ స్థానిక పద్మా నిలయం హాస్టల్లో స్నేహితులు పాలడుగు రాజు, సూర్య, రాజేశ్, రాహుల్ రెడ్డి, గణేష్, అనీష్‌లతో కలిసి రెండు వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. గురువారం రాత్రి ముషీరాబాద్‌లోని ఓ సినిమా థియేటర్లో సెకండ్ షో సినిమా చూసేందుకు స్నేహితులంతా కలిసి నాలుగు బైక్‌లపై వెళ్లారు. సినిమా వదిలిన తర్వాత బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు ఓయూ వడ్డెర బస్తీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం హాస్టల్‌కు బయలు దేరారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో భవన్, మాలేపు రోషన్ ఒక బైక్‌పై వెళుతుండగా మిగిలిన స్నేహితులు మరో మూడు వాహనాలపై బయలు దేరారు. భవన్ వాహనాన్ని నడుపుతుండగా రోషన్ వెనుక కూర్చున్నాడు. బైక్ బ్రేకులు సరిగా పడడంలేదని నెమ్మదిగా పోవాలని భవన్‌కు మరో స్నేహితుడు సూచించాడు. అయినా అతను పట్టించుకోకుండా అతి వేగంగా ఎన్ఫీల్డ్ వాహనంపై అడిక్‌మెట్ ఫ్లై ఓవర్‌పైకి చేరుకున్నారు. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి ఫ్లై ఓవర్‌పై ఉన్న ఫుట్ పాత్‌ను ఢీకొట్టింది. దీంతో భవన్, రోషన్ ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇద్దరి తలకు, కాళ్లు చేతులకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడ మృతి చెందారు. నల్లకుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. మృతుల స్నేహితుడు పాలడుగు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యను దింపి బైక్ ఎక్కిన రోషన్ పెట్రోల్ పోయించుకునేందు వెళ్లిన సమయంలో భవన్ బైక్‌పై మరో స్నేహితుడు సూర్య ఉన్నాడు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత భవన్ బైక్‌పై నేను వెళతాను నీవు వేరే బైక్‌పై రమ్మని రోషన్ చెప్పాడు. దీంతో సూర్య మరో స్నేహితుడి బైక్‌పై రావడంతో అతని ప్రాణాలు దక్కాయి. రోషన్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. -
కోట్లు వచ్చేలా చేస్తాం.. రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా!
హిమాయత్‌నగర్: షేర్ మార్కెట్‌పై నగర వాసికి ఉన్న మక్కువను క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆయన అకౌంట్‌ను హ్యాక్ చేసి తెలియకుండా అతి తక్కువ ధరకు షేర్స్‌ను అమ్మేశారు. మళ్లీ షేర్ హోల్డర్‌తోనే ఎక్కువ రేట్‌కు షేర్స్‌ను కొనుగోలు చేపించి రూ.లక్షలు నష్టపోయేలా చేయడంతో.. బాధితుడు శుక్రవారం సిటీసైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్లకుంటకు చెందిన హరీష్‌చంద్రారెడ్డి కొంతకాలంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు. షేర్స్‌ను కొనుగోలు చేసి ఎల్ఐఎస్బ్లూ ఫైనాన్షియల్ త్రూ అమ్మడం, కొనడం చేస్తుంటాడు. ఈ క్రమంలో పరిచయం అయిన సైబర్ కేటుగాళ్లు హరీష్‌చంద్రారెడ్డి అకౌంట్‌ను హ్యాక్ చేశారు. రూ.700 విలువ గల షేర్స్‌ను కేవలం రూ.100కు ఇతరులకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్‌చంద్రారెడ్డి వెబ్సైట్లో ఉన్న వారిని ప్రశ్నించగా.. కోట్లు వచ్చేలా చేస్తామని నమ్మించారు. లాభాలు లేని వాటిని రూ.700–800 చొప్పున కొనుగోలు చేయించారు. ఇలా పలు దఫాలుగా కేవలం రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరీష్‌చంద్రారెడ్డి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. మీ డబ్బంతా ఏజెంట్ తినేశాడంటూ.. వృద్ధుడికి రూ.25లక్షలు టొకరా ఇన్సురెన్స్ ఎక్స్పైరీ అయినా సరే..సైబర్ కేటుగాళ్లు మాత్రం అమాయకుల్ని వదలట్లేదు. మీకు రావాల్సిన దానికంటే తక్కువ డబ్బును పొందారు. మీకేం బాధ అనిపించడం లేదా అంటూ సింపతితో లక్షలు కాజేశారు. కుల్సుంపురాకు చెందిన వృద్ధుడు రెండు సంస్థల్లో ఇన్సురెన్స్ చేశాడు. అది చాలా కాలం క్రితం ఎక్స్పైరీ కూడా అయ్యింది. తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కాల్ చేసి ఆధార్, పాన్, బ్యాంక్ డిటైల్స్ తీసుకున్నాడు. కొంత డబ్బు కట్టాలనడంతో వృద్ధుడు చెల్లించాడు. రూ.3 లక్షలు వస్తాయని నమ్మించి పలు దఫాలుగా అతడి నుంచి రూ.25లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీసైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్ -
తలసీమియా బాధిత చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్.. అసలేం జరిగిందంటే..
సాక్షి, హైదరాబాద్: తలసీమియాతో బాధపడుతున్న తమ మూడేళ్ల కుమారుడికి ఓ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించడంతో(బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్) హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని, దీనికి కారణమైన బ్లడ్ బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మొగిలిచర్ల రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, రాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టిన సమయంలో బాలుడిని పరీక్షించిన నిలోఫర్ వైద్యులు తలసేమియాతో బాధ పడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలుడికి గత రెండున్నరేళ్లుగా విద్యానగర్ అచ్యుతా రెడ్డి మార్గ్‌లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 20న కూడా అతడికి రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బాలునికి రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మరో ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా అక్కడ అదే ఫలితం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండు ఆస్పత్రుల్లోనూ రక్త పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయమై సదరు బ్లడ్ బ్యాంక్ వైద్యులను ప్రశ్నించగా తాము అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరిస్తామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. దీంతో బాధిత బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బ్లడ్ బ్యాంక్ నుంచి రికార్డులు తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. రక్తం ఎక్కించుకుంటున్న వారిలో ఆందోళన ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమకు హెచ్ఐవీ సోకిందేమోననే అనుమానంతో వారు ల్యాబ్‌లకు పరుగులు తీస్తూ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం. ఎలాంటి పొరపాటు జరుగలేదు రక్తం సేకరించే ముందు దాతలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే రక్తం సేకరిస్తాం. మా బ్లడ్ బ్యాంక్‌లో 20 పడకల ఆస్పత్రి ఉంది. తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తాం. గత రెండున్నరేళ్లలో బాధిత బాలుడికి బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రిలో 42 సార్లు రక్తం ఎక్కించాం. ఈ క్రమంలో గత నెలలో బాలుడిని పరీక్షించి హెచ్ఐవీ సోకిందని అతడి తండ్రికి ముందే చెప్పాం. బాలుడికి హెచ్ఐవీ సోకడంలో తమ బ్లడ్ బ్యాంక్ తప్పిదం ఏమీ లేదు. హెచ్ఐవీ సోకిన వారిలో విండో పీరియడ్ ఉంటుంది, ఆ విండో పీరియడ్ తర్వాతనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రి రికార్డులు పూర్తిగా నల్లకుంట పోలీసులకు చూపించాం. – డాక్టర్ పిచ్చి రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ -
నల్లకుంటలో విద్యార్థి అదృశ్యం.. తండ్రి మందలించడంతో పాల ప్యాకెట్ కోసమని వెళ్లి..
Son Goes Missing After Father Asks School Diary: స్కూల్ డైరీ చూపించలేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన బాలుడు అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మొగిలిచర్ల రవి తెలిపిన వివరాల మేరకు.. అవగాన్ అజయ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి విద్యానగర్ మణిసదన్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. స్థానిక నారాయణ స్కూల్లో ఏడవ తరగతి చదువున్న కుమారుడు అవగాన్ కార్తీక్‌కుమార్ గత కొద్ది రోజులుగా తన స్కూల్ డైరీని చూపించడం లేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రి మందలించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాల ప్యాకెట్ తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కార్తీక్ సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కుమారుడి ఆచూకి కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో అజయ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకి తెలిస్తే మొబైల్: 9490616373 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. చదవండి: ఐటీ బాట పట్టిన హైదరాబాద్: కొత్తగా వందలాది కంపెనీలు.. వేలాదీ కొలువులు -
సర్టిఫికెట్స్ జిరాక్స్ కోసం వెళ్ళింది.. సాయంత్రమైనా రాకపోయేసరికి..
సాక్షి, నల్లకుంట( హైదరాబాద్): సర్టిఫికెట్స్ జిరాక్స్ తీసుకువస్తానని చెప్పి వెళ్లిన డిగ్రీ రెండో సంవత్సరం విద్యారి్థని అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లకుంటకు చెందిన బీఆర్ ఇందిర, నాగరాజు దంపతుల కుమార్తె శ్రావణి అలియాస్ డాలి (23) బీఎన్‌రెడ్డి నగర్లో సాయి గాయత్రీ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నది. అక్కడే హాస్టల్లో ఉంటుంది. గత నెలలో డిగ్రీ పరీక్షలు ముగియడంతో హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వచ్చింది. ఈ నెల 16న ఉదయం 10:30 గంటల సమయంలో వాళ్ల ఇంట్లో ఉండే రూపతో కలిసి సర్టిఫికెట్స్ జిరాక్స్ తీసుకుస్తానని చెప్పి వెళ్లిన శ్రావణి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. బీఎన్ రెడ్డిలోని హాస్టల్‌కు ఫోన్ చేసి వాకబు చేయగా ఆమె అక్కడికి రాలేదని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన రూప సరి్టఫికెట్స్ జిరాక్స్ కోసం వెళ్లిన శ్రావణి కనిపించడం లేదంటూ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి అదృశ్యంపై ఆమె స్నేహితులు చిట్టి, రామ్ నాయక్‌లపై అనుమానం ఉందని రూప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఈ ఫొటోలోని యువతి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే నల్లకుంట పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు -
నంబర్ ప్లేట్‌పై ‘అప్నా టైమ్ ఆయేగా’.. ఇక నీ టైం అయిపోయింది!
సాక్షి, నల్లకుంట: నంబర్ ప్లేట్‌పై నంబర్ కనిపించకుండా ట్రాఫిక్ వయోలెన్స్‌కు పాల్పడిన ఓ మైనర్‌పై కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం ఓయూ ఎన్సీసీ ఎక్స్ రోడ్స్ వద్ద నల్లకుంట సెక్టార్–2 పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విద్యానగర్ చర్చి కాలనీకి చెందిన ఓ మైనర్ (16) హీరో మ్యాస్ట్రో ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. వాహనం నంబర్ ప్లేట్‌పై నల్లటి తొడుగు ఉండడంతో ఆ వాహనాన్ని వెంబడించిన పోలీసులు విద్యానగర్ చర్చి వద్ద నిలిపి వేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో పోలీసులు పంపించే ఈ చలానాల నుంచి తప్పించుకోవడానికి వెనుక నంబర్ ప్లేట్‌పై మాస్క్ లాంటి నల్లటి ఓ తొడుగును తొడిగాడు. దానిపై ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే స్లోగన్ రాశాడు. ఆర్సీ చెక్ చేయగా వాహన నంబర్ టీఎస్11ఈసీ 7505 అని ఉంది. ఇక ఏముంది అప్నా టైమ్ ఆయేగా కాదు ఇప్పుడు పోలీసుల టైం వచ్చిందంటూ మోటారు వాహన చట్టం ప్రకారం నల్లకుంట పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. -
ఉదృతంగా ప్రవహిస్తున్న నల్లకుంట నాలా
-
Fever Hospital Hyderabad: కోవిడ్ సేవలకు ఫీవర్ ఆస్పత్రి
నల్లకుంట: కోవిడ్ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిని పూర్తిగా కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ఐఏఎస్ అధికారిని నియమించింది. ఆ అధికారి ఆదేశాలతో కోవిడ్ రోగులకు అవసరమైన అదనపు ఆక్సిజన్ పడకలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 136 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా మరో 200 పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చే చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో ఉన్న 330 పడకలను పూర్తి స్థాయిలో ఆక్సిజన్ పడకలుగా మారుస్తున్నారు. ఇప్పటి వరకు 100 పడకలకు త్రీ లైన్ ఆక్సిజన్, 36 పడకలకు సింగిల్ లైన్ ఆక్సిజన్ సరఫరా ఉంది. అలాగే మరో 20 ఐసీయూ వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రి ఆవరణలో 6 కేఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. దీని ద్వారానే వార్డుల్లోని అన్ని పడకలకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ఇప్పటికే ఆస్పత్రిలోని 2,3,4 వార్డులను పూర్తిస్థాయి ఆక్సిజన్ పడకలుగా మార్చారు. మరోవారం రోజుల్లో 1,6,7, 8 వార్డుల్లో ఉన్న పడకలకు కూడా సింగిల్ లైన్ ఆక్సిజన్ పడకలుగా మార్చనున్నారు. పనుల పరిశీలన ఈ పనులను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారి శివలింగయ్య మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌తో కలిసి ముందుగా అక్కడి ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీవర్ ఆస్పత్రిని కూడా పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ పలువురు కోవిడ్ రోగులు ఉన్నారని, వారికి కావాల్సిన అన్ని మందులు, ఇంజెక్షన్లు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో వారం రోజుల్లో అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మారుస్తామని తెలిపారు. ఆస్పత్రిలో కోవిడ్ ఓపీ క్లినిక్ కూడా ఉందని, కోవిడ్ అనుమానితులు, బాధితులకు ఈ క్లినిక్‌లో చికిత్సలు అందజేస్తున్నామన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఎల్ఈడీ లైట్లు, పోలీస్ ఔట్ పోస్టు కూడా ఏర్పాటు చేయించామని తెలిపారు. ఆస్పత్రి సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ జయలక్ష్మి, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఫీవర్‌ను పూర్తి స్థాయిలో కోవిడ్ ఆస్పత్రిగా మార్చితే సాధారణ రోగుల చికిత్సలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. -
నల్లకుంటలో ఘోర ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి
-
ఘోర ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని విద్యానగర్- నల్లకుంట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సౌత్ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఎండ్రిక్ హఠన్(23) అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఎండ్రిక్ విద్యానగర్ నుంచి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళ సభ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బైక్‌పై అధిక వేగంతో వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో అధిక వేగంతో డివైడర్‌ను డీకొని స్తంభానికి బలంగా డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. -
క్లాస్‌రూమ్‌లో కర్కశత్వం..
సాక్షి, హైదరాబాద్ : నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో ఓ విద్యార్థిపై టీచర్ ప్రతాపం చూపించారు. 4వ తరగతి చదువుతున్న ఎన్.సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ప్లాస్టిక్ స్కేల్‌తో చేయి, వీపు భాగంలో కొట్టడంతో బాలుడి చర్మం ఎర్రగా కందిపోయింది. విద్యార్థి నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా టీచర్ కర్కశంగా వ్యవహరించింది. అరగంట పాటు తమ బిడ్డను టీచర్ చితక్కొట్టిందని విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపించారు. టీచర్ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. దిక్కున్నచోట చెప్పుకోండి అని బెదిరించారని వాపోయారు. ‘ప్రతి క్లాస్ రూమ్‌లో సీసీటీవీ ఉంది. ఆ రికార్డులను పరిశీలించి టీచర్‌పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. -
ఫీవర్ ఆస్పత్రిలో 3 కరోనా కేసులు!
నల్లకుంట: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి వారికి ఏమాత్రం వైరస్ లక్షణాలున్నా వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. దీనిలో భాగంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని 7వ వార్డును(ఐసోలేటెడ్) కరోనా అనుమానిత కేసుల కోసం సిద్ధం చేశారు. అయితే నగరంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానించి వారి నుంచి శాంపిళ్లను సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. బ్లిహిల్స్‌కు చెందిన నాగార్జునరెడ్డి కుమారుడు అమర్నాథ్ రెడ్డి(25) ఇటీవల చైనా నుంచి నగరానికి వచ్చాడు. అనంతరం అస్వస్థతకు గురై అతను శనివారం రాత్రి ఫీవర్ ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడిని పరీక్షించి అనుమానిత కరోనా కేసుగా పరిగణించారు. ఐసోలేటెడ్ వార్డులో అతడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మరో 2 అనుమానిత కరోనా కేసులు వచ్చాయి. ఈ ముగ్గురినీ ఐసోలేటెడ్ వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ ఆదివారం మీడియాకు తెలిపారు. వీరికంటే ముందు గా పది రోజుల క్రితం చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విద్యార్థి దగ్గు, జలుబుతో అస్వస్థతకు గురయ్యాడు. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఆ విద్యార్థి ఫీవర్ ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షల్లో సాధారణ ఫ్లూగా తేలింది. అతడికి చికిత్స చేసి ఆస్పత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జి చేశారు. -
నల్లకుంటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
ఫీవర్‌కు పెరుగుతున్నరోగుల తాకిడి
నల్లకుంట: విష జ్వరాలతో వస్తున్న రోగులతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. గత రెండు వారాలుగా రోగుల తాకిడి పెరగడంతో ఆసుపత్రి అధికారులు ప్రత్యేక చర్యలు తీçసుకుంటున్నారు. రద్ధీ కనుగుణంగా ఓపీ విభాగంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఓపీలో ఇబ్బందులు తలెత్తకపోయినా రక్త పరీక్షల ల్యాబ్, ఫార్మసీ కౌంటర్ల వద్ద రోగులు క్యూలైన్లో బారులు తీరాల్సి వచ్చింది. జ్వరాలన్నీ డెంగీ కాదు గాలిలో తేమ కారణంగా వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందవద్దు. పలువురు డెంగీ భయంతో జ్వరం రాగానే ఫీవర్‌కు పరుగులు తీస్తున్నారు. జ్వరాలన్నీ డెంగీ కాదు. కాచి. చల్లార్చి వడ కట్టిన నీటినే తాగాలి. వ్యక్తిగత పరిశుభ్రతలతో చాలా వరకు వ్యాధులను నివారించవచ్చు. రోగుల తాకిడికి అనుగుణంగా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశాము. మందుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ల్యాబ్ వద్ద రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించాం. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాము.– డాక్టర్ కె. శంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఫీవర్.. ఫియర్
-
డెంగీతో చిన్నారి మృతి
నల్లకుంట: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి కొనసాగుతోంది. జ్వరపీడితులు ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్లో వేచి ఉంటున్నారు. ఓపీ ప్రారంభ సమయానికి ముందే దాదాపు 500 మంది వరకు క్యూలైన్లో వేచి ఉంటుండడం గమనార్హం. ఉదయం 8.30 గంటకు ఓపీ చీటీలు జారీ చేస్తుండగా, 9 గంటలకు ఓపీలో రోగులకు చికిత్సలు ప్రారంభిస్తున్నారు. చికిత్సల కోసం వచ్చే వారిలో అధికంగా వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. గాంధీ నుంచి నలుగురు వైద్యులు.. ఫీవర్‌లో రోగుల రద్దీ కారణంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం గాంధీ ఆసుపత్రి నుంచి నలుగురు వైద్యులను డిప్యుటేషన్ పంపించారు. సోమవారం డిప్యూటేషన్‌పై వచ్చిన మరో వైద్యుడు మంగళవారం సెలవుపై వెళ్లడం విస్మయాన్ని కలిగిస్తుంది. రోగుల సేవలో ఆర్ఎంఓ,డిప్యూటీ ఆర్‌ఎంఓలు.. రోగుల తాకిడి పెరగడంతో ఫీవర్ ఆర్ఎంఓ, డిప్యూటీ ఆర్‌ఎంఓలు ఎమర్జెన్సీ ఓపీలో కూర్చుని రోగులను పరీక్షించారు. మరో 30 మంది వైద్యులు, హౌజ్ సర్జన్లు 30 కౌంటర్లలో రోగులను పరీక్షించారు. రిపోర్టుల కోసం భారీ క్యూ.. గంటల తరబడి క్యూలో వేచి ఉండడం ఒక సమస్య అయితే..రిపోర్టులు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. రిపోర్టుల జారీకి ఒక్కటే కౌంటర్ ఉండడంతో రోగులు ఆసుపత్రి ప్రధాన గేటు బయటి వరకు క్యూ కడుతున్నారు. అతి కష్టం మీద రిపోర్టులు తీసుకుని వెళితే, ఓపీలో వైద్యుల వద్దకు చేరుకోవాలంటే మరో గంట క్యూలైన్లో వేచి ఉంటే కాని వైద్య పరీక్షలు అందని పరిస్థితి. డెంగీతో చిన్నారి మృతి చింతల్: డెంగీ జ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో జరిగింది. రంగారెడ్డినగర్ డివిజన్ పంచశీల కాలనీకి చెందిన ప్రభాకర్, పవన్ కుమారి ల కుమార్తె దర్శిని (4) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ఐదు రోజుల క్రితం దర్శిని తీవ్ర జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్లినిక్‌కు తీసుకువెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యలు డెంగీ జ్వరంగా తేల్చారు. నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. జేసీ ఆకస్మిక తనిఖీ నల్లకుంట: ఫీవర్ ఆసుపత్రిలో రద్దీని, వైద్యసేవలను హైదరాబాద్ ఇల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) జి. రవి మంగళవారం మధ్యాహ్నం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె. వెంకటి, ఆర్డీఓ డి.శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ముందుగా ఓపీ ఫార్మసీ కౌంటర్లను, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. ఓపీలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరాతీశారు. ఆసుపత్రి సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ రేణుక రాణిలతో మాట్లాడారు.ఓపిలో రద్దీని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కోసం ఆసుపత్రి ఆవరణలోని కొన్ని భవనాలను పరిశీలించారు. అదనపు ఓపీ కౌంటర్ల ఏర్పాటుకు లెక్చర్ హాల్ అనుకూలంగా ఉంటుందని ఆసుపత్రి అధికారులు చెప్పారు. -
హైదరాబాద్ నల్లకుంట శకరమటంలో చోరి
-
ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
సాక్షి, అనంతపురం: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ-వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 9మందిగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు రెండూ వేగంగా వస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డ వారిని సమీపంలోని తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సైతం పట్టించుకునే నాధుడే కరువైయ్యాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా బాధితులు అనంతపురం- చెన్నై రహదారిని దిగ్భందించారు. వారి ఆందోళనతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
హాస్టల్లో ఫుడ్ పాయిజన్
హైదరాబాద్/చేవెళ్ల: వికారాబాద్ జిల్లా చేవెళ్లకు చెందిన కస్తూర్బా రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినులు కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో బాధపడుతుండగా పాఠశాల సిబ్బంది నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. చేవెళ్లలోని కçస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్సీ పాఠశాలలో మొత్తం 206 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి భోజనంలో ఫ్రూట్స్ సలాడ్‌తో పాటు అన్నం, క్యాప్సికం కర్రీ, సాంబార్, మజ్జిగను ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విద్యార్థినులకు కడుపులో నొప్పి రావడంతో పాటు వాంతులు, విరేచనాలు మొదలయ్యా యి. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మొదలైంది. సుమారు 67 మంది విద్యార్థినులను పాఠశాల హాస్ట ల్ వార్డెన్, టీచర్లు, సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని సూచించారు. దీంతో కొందరిని నీలోఫర్ ఆస్పత్రికి, మరికొందరిని ఉస్మానియాకు తరలించారు. వీరిలో ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్న 12 మంది విద్యార్థినులను నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో 8,9,10 వ తరగతి విద్యార్థినులే ఉన్నారు. వీరిని అక్కడి టీచర్ రేణుక, ఏఎన్ఎం మనోహర్ తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలిత, చేవెళ్ల ఆర్డీవో హన్మంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. ఘట నపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత చిట్యాల(భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళా శాలలో కలుషిత ఆహారం తినడం వల్ల 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. -
సిటీ కేంద్రంగా కాల్ రూటింగ్!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ పద్ధతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) పద్ధతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్ ఒకటి హైదరాబాద్‌లో నడుస్తున్నట్లు మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) అధికారులు గుర్తించారు. వారు అందించిన సమాచారం మేరకు నల్లకుంట పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు దినేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూటర్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్ రూటింగ్ వ్యవహారం వెనుక ఉగ్రవాద కోణం ఉన్నట్లు ఎంఐ అనుమానిస్తుండగా, నిందితుడిని వివిధ కోణాల్లో విచారించిన నగర పోలీసులు అలాంటి లేదని తేల్చారు. ఈ తరహా ఎక్స్ఛేంజ్లు ఇక్కడి కాల్స్‌ను (ఔట్ గోయింగ్) బయటి దేశాలకు పంపలేవని, కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటిని మాత్రమే లోకల్ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి (ఇన్కమింగ్) అందించగలవని అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ కాల్ వచ్చేది ఇలా... విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడికి చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఆ మొత్తం ఎగ్గొట్టడానికే... ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతా విదేశాల్లోనే ఉంటారు. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్లాలంటే (ఔట్ గోయింగ్) కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉండటంతో అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ను వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తుంటారు. రూటింగ్ జరిగేది ఇలా... విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంత మందికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయిస్తారు. అనంతరం విదేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దానిని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడ ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్ తగ్గుతుంది. దేశంలోని అనేక ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు దెబ్బతింటున్నాయి. ఇలా దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్ ఆ మొత్తాన్నీ మిగుల్చుకుంటున్నాడు. ఇక్కడ అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంది. ఈ కారణంగానే ప్రాధాన్యం... దినేష్ చేస్తున్న కాల్ రూటింగ్ వ్యవహారానికి సంబంధించి నగర పోలీసులకు మిలటరీ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. సాధారణంగా ఈ తరహా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉగ్రవాదానికి ఉపకరించే అక్రమ లావాదేవీల పైనా కన్నేసి ఉంచుతాయి. ఈ నేపథ్యంలో రూటింగ్ వ్యవహారం వారి దృష్టికి వచ్చింది. పాక్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారులను ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిజంగానే యువతుల్ని రంగంలోకి దింపుతారు. కొంత పరిచయం పెరిగిన తర్వాత ఇక్కడి అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలు, సమాచారం చూపిస్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. ఇటీవల దేశ వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీల అధికారులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్ బ్యాక్ చేసే అవకాశం లేని నేపథ్యంలో రూటింగ్ ద్వారానే దీనికి పాల్పడ్డారు. దీంతో దినేష్ వ్యవహారంలోనూ అలాంటి కోణం ఉంటుందని ఎంఐ అనుమానించింది. దీంతో అతడిని పోలీసులు లోతుగా విచారించి అలాంటిది లేదని తేల్చారు. -
భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య
హైదరాబాద్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపం చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి ఏడు నెలల గర్భవతి అయిన భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య మృతదేహాన్ని బెడ్రూమ్లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన బయ్య లింగమల్లమ్మ, సర్వయ్య దంపతుల కుమార్తె సుమలత(25)కు మిర్యాలగూడకు చెందిన ఎం.మలయాద్రి కుమారుడు మేకల మాధవ్ (30)తో కిందటేడాది అక్టోబర్ 5న వివాహం జరిగింది. ఆ సమయంలో అల్లుడు మాధవ్‌కు రూ.6 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. వివాహం అయిన కొంతకాలం వీరి కాపురం సజావుగా నడిచింది. భార్య మెడ చుట్టూ చున్నీ బిగించి.. నల్లకుంట సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న మేకల మాధవ్ శంకరమఠం ఎదురు వీధిలో గల ఆరో విల్లా అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 303లో అద్దెకు దిగాడు. ఏడు నెలల గర్భవతి అయిన సుమలత గత కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటూ ఈ నెల 16న తల్లితో కలసి భర్త వద్దకు వచ్చింది. తల్లి ఈ నెల 18న సాయంత్రం కుమార్తెను ఇక్కడే వదిలి స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంట్లో జరిగిన విషయాలకు మనస్తాపం చెందిన మాధవ్ శనివారం మధ్యాహ్నం భార్య సుమలత మెడ చుట్టూ చున్నీతో బిగించి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని బెడ్రూమ్లోనే ఉంచి, ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి.. నడుస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతుని ఐడీ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకుని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. భర్త ఆత్మహత్యతో బయటపడిన భార్య హత్య మాధవ్ తండ్రి మలయాద్రి శనివారం సాయంత్రం 4.30కి వియ్యంకురాలు లింగమల్లమ్మకు ఫోన్ చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వెంటనే లింగమల్లమ్మ కుమార్తెకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన లింగమల్లమ్మ బంధువులతో కలసి రాత్రి 8.30 గంటలకు నల్లకుంటలో కుమార్తె నివాసముంటున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. పోలీసుల సమక్షంలో తాళం పగులగొట్టి చూడగా సుమలత బెడ్రూమ్లో విగత జీవిగా పడి ఉంది. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లకుంట సీఐ వి.యాదగిరిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లకుంటలో శతారుద్ర మహాయాగం
-
అమ్మవారి పూజలో సీఎం సతీమణి
నల్లకుంట: ముఖ్య మంత్రి కేసీఆర్ సతీమణి శోభ శుక్రవారం నల్లకుంటలోని పాత రామాలయాన్ని సందర్శించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారి వద్ద హోమం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంతాచారి తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. -
రూ.లక్ష ఇస్తామని చెప్పినా చంపాడు
నల్లకుంట: ఆస్తి వివాదం మహిళ హత్యకు దారి తీసింది. కోర్టులో కేసు వీగిపోవడంతో కక్షగట్టిన ఓ వ్యక్తి ఉదయాన్నే షాపుకెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్తున్న మహిళను అడ్డగించి రాడ్‌తో తలపై బాది అతికిరాతకంగా చంపేశాడు. అక్కడి నుంచి నేరుగా నల్లకుంట పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఇన్ స్పెక్టర్ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాలు... శంకర్‌మఠం సమీపంలో టైలర్ షాప్ నిర్వహిస్తున్న చెగూరి సత్యనారాయణ, ఉమ (56) దంపతులు 1992లో అడిక్‌మెట్ దయానంద్ నగర్లో నర్సింగ్‌రావు అనే వ్యక్తి వద్ద 50 గజాల స్థలం కొన్నారు. 1993లో ఆ స్థలాన్ని ఉమ పేరిట నోటరీ చేయించుకుని ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు. సచివాలయంలో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పి. దర్మరాజు అనే వ్యక్తి వీరింటి పక్కనే ఉంటున్నాడు. ఉమ దంపతులు నిర్మించుకున్న స్థలం తనదంటూ ధర్మరాజు కొన్నేళ్లుగా ఉమ కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతున్నాడు. రెండేళ్ల క్రితం ధర్మరాజు కోర్టుకు వెళ్లగా, ఆ స్థలం ఉమ కుటుంబ సభ్యులకే దక్కుతుందని తీర్పునిస్తూ ధర్మరాజు వేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో కక్షగట్టిన ధర్మరాజు ఎలాగైనా ఉమను అంతమొందించాలని పథకం వేశాడు. బుధవారం ఉదయం 6.45కి షాపుకెళ్లి పాల ప్యాకెట్ తీసుకుని వస్తున్న ఉమను రోడ్డుపై అడ్డగించి రాడ్‌తో తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తశ్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్లిన బస్తీకి చెందిన ఓ వ్యక్తి రక్తపుమడుగులో పడి ఉన్న ఉమను చూసి ఆమె కుటుంబసభ్యులకు చెప్పాడు. ఇదిలా ఉండగా.. ధర్మరాజు హత్యకు ఉపయోగించిన ఇరుప రాడ్ తీసుకుని నేరుగా నల్లకుంట ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. హతురాలి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. రూ. లక్ష ఇస్తే స్థలం ఇచ్చేస్తామని చెప్పాం 1992లో లక్ష రూపాయలకు 50 గజాల స్థలాన్ని కొన్నాం. ఆ స్థలం తనదని ధర్మరాజు తరచూ మాతో గొడపడేవాడు. దీంతో విసిగిపోయిన మేము రూ. లక్ష ఇస్తే స్థలం వదిలి వెళ్లిపోతామన్నాం. అయినా వినకుండా రెండుసార్లు కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఆ స్థలం మాకే చెందుతుందని తీర్పు చెప్పింది. దీంతో కక్షగట్టిన ధర్మారాజు రెండేళ్లుగా తరచూ గొడవపడేవాడు. చివరకు అన్యాయంగా నా భార్య ప్రాణం తీశాడు. అతడిని కఠినంగా శిక్షించాలి. –సత్యనారాయణ, మృతురాలి భర్త -
చెవి దుద్దుల కోసం చిన్నారి కిడ్నాప్..
నల్లకుంట: ఐదేళ్ల చిన్నారిని అగంతుకురాలు కిడ్నాప్ చేసి.. చెవి దుద్దులు తీసుకొని విడిచి పెట్టింది. నల్లకుంట ఇన్స్పెక్టర్ యాదగిరి రెడ్డి కథనం ప్రకారం... అడిక్‌మెట్ వడ్డెర బస్తీలోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో వంటమనిషిగా పని చేస్తున్న వి.దివ్యకు కుమార్తె వి.హర్షిత (5), కుమారుడు భానుప్రసాద్ (7) సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో హర్షిత ఒకటో తరగతి, భానుప్రసాద్ రెండో తరగతి చదువుతున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న హర్షిత అన్నతో కలిసి అక్కడే ఆడుకుంటుండగా... ఉదయం 11 గంటలకు గుర్తు తెలియని మహిళ వారి వద్దకు వచ్చింది. చాక్లెట్లు కొనిపెడతానని హర్షితను తీసుకెళ్లింది. ఆకలి వేస్తుండటంతో కొద్ది సేపటికి భాను ప్రసాద్ తల్లి వద్దకు వెళ్లాడు. చెల్లి ఎక్కడ ఉందని తల్లి అడగగా... చీరకట్టుకొని వచ్చిన ఓ అక్క చాక్లెట్ కొనిపెడతానని చెల్లిని తీసుకెళ్లిందని చెప్పాడు. వెంటనే తల్లి పాఠశాల వద్దకు వెళ్లి ఆరా తీయగా హర్షిత ఆచూకీ తెలియకపోవడంతో మధ్యాహ్నం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని ఠాణాలకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా... హర్షితను కిడ్నాప్ చేసిన మహిళ ఆ చిన్నారి చెవులకు ఉన్న గ్రాము బంగారు దుద్దులు తీసుకుని మధ్యాహ్నం అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద వదిలి వెళ్లింది. అక్కడ ఏడుస్తూ కూర్చున్న చిన్నారిని స్థానికులు అంబర్‌పేట ఠాణాలో అప్పగించారు. అప్పటికే నల్లకుంట పీఎస్‌లో చిన్నారి మిస్సింగ్ కేసు నమోదైన విషయం తెలిసి అంబర్‌పేట పోలీసులు వారిని సంప్రదించి.. ఈ బాలికే అక్కడ అదృశ్యమైన హర్షితగా నిర్థారించుకున్నారు. అనంతరం నల్లకుంట పోలీసులు హర్షితను తీసుకెళ్లి తల్లి దివ్యకు అప్పగించారు. కాగా, బాలికను కిడ్నాప్ చేసిన అగంతకురాలి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
వణికిస్తున్న వ్యాధులు
♦ ఫీవర్ ఆస్పత్రిలో రోగులు బారులు తీరుతున్నారు. ♦ చలిజ్వరాల బాధితులతో బుధవారం ఆస్పత్రి కిక్కిరిసింది. ♦ చాలీచాలని వసతులతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్లకుంట: సీజనల్ వ్యాధుల కారణంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరడంతో ఓపీ విభాగాన్ని బుధవారం నుంచి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పొడిగించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఓపీ నిర్వహిస్తారు. అయితే గత కొద్ది రోజులుగా రోగుల సంఖ్య పెరగడంతో ఓపీ సమయాన్ని పొడిగించినట్లు ఆస్పత్రి డీఎంఓ డాక్టర్ శ్రీకాంత్ భట్ తెలిపారు. రోగులకు సేవలందించేందుకు ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఇద్దరు సీనియర్ వైద్యులు , గాంధీ నుంచి ముగ్గురు పీజీలు డిప్యూటేషన్‌పై నియమించినట్లు తెలిపారు. ఫార్మసీలో సాయంత్రం 4 గంటల వరకు మందులు అందజేస్తారన్నారు. కానరాని ఉస్మానియా వైద్యులు ఫీవర్‌లో ఓపీ సమయాన్ని పొడిగించినప్పటికీ ఉస్మానియా నుంచి డిప్యుటేషన్‌పై నియమితులైన ఇద్దరు వైద్యులు మొదటి రోజే విధులకు డుమ్మాకొట్టారు. గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చిన ఇద్దరు పీజీలు విధులు నిర్వహించారు. వైద్యులు, ఫార్మసీ సిబ్బందిపై అదనపు పనిభారం పడటంతో వారు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఓపీ సమయం పొడిగింపుపై ఉద్యోగులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆస్పత్రి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ పనివేళలు పొడిగించినప్పటికీ రోగుల రద్ధీ కనుగుణంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నగరాన్ని వణికిస్తున్న ఫీవర్!
నల్లకుంట: వ్యాధులు ప్రబలుతుండడంతో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ఆస్పత్రి ఓపీ విభాగం ఉదయం 12 గంటలకే మూసి వేస్తుండడంతో చికిత్సల కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. పైగా వందల సంఖ్యలో వస్తున్న రోగులు గంటల కొద్దీ క్యూలైన్లో వేచి ఉంటుండడంతో తొక్కిసలాట జరుగుతోంది. సోమవారం తొక్కిసలాటలో కొందరు రోగులు సొమ్మసిల్లి పడిపోయారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ శంకర్ మంగళవారం ఉదయం ఓపీ క్యూలైన్ పరిశీలించారు. రద్దీని బట్టి ఓపీ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగిస్తామని రోగులతో చెప్పారు. కొందరు వైద్యులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఓపీ సమయాన్ని పొడిగించకుండా మధ్యాహ్నం 2 గంటల వరకు క్యూలైన్లో వేచి ఉన్న రోగులందరినీ పరీక్షిస్తామని వైద్యులు తెలిపినట్లు సమాచారం. దీంతో సూపరెంటెండెంట్ ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారని తెలిసింది. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సమయాన్ని పొడిగిస్తే వైద్యులకు డబుల్ ఇంక్రిమెంట్ వస్తుంది. ఫార్మసీ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇంక్రిమెంట్లు ఉండవు. అలాంటప్పుడు సమయాన్ని పొడిగించడం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉండగా ‘ఫార్మసీ క్యూలో రోగులకు తప్పని ఇక్కట్లు’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు రోగులకు మందులు ఇచ్చేందుకు మరో ఉద్యోగిని తీసుకున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో వైద్యం కోసం బారులు తీరిన ప్రజలు -
అయ్యో.. పాపం!
ఫీవర్ ఆస్పత్రిలో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు కళ్లు కనిపించని ళవృద్ధురాలిని ఫీవర్ ఆవరణలో వదిలి వెళ్లిన కఠినాత్ములు నల్లకుంట : గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలి(80)ని ఆటోలో తీసుకు వచ్చి ఫీవర్ ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లారు. అందరూ ఉండి అనాథగా మిగిలిన కళ్లు కనిపించని ఆ అవ్వ తాను ఎక్కడ ఉన్నది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంది. పైగా తాను కొడుకు ఇంట్లోనే ఉన్నానని అనుకుంటోంది. శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని ఆటోలో తీసుకు వచ్చి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఆ వృద్ధురాలికి కళ్లు కనిపించవు. దీంతో రాత్రి 8 గంటల వరకు అలాగే ఆస్పత్రి ఎమర్జెన్సీ ఓపీ వద్ద కూర్చుండిపోయింది. అది గమనించి సాక్షి ప్రతినిధి వృద్ధురాలి వద్దకు వెళ్లి పలకరించగా తాను అందరూ ఉన్న అనాథ అని వాపోయింది. తన పేరు లక్ష్మమ్మ(80) అని, నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెలువర్తి స్వగ్రామమని వివరించింది. తనకు ఇద్దరు కొడుకులని పెద్ద కొడుకు యాదయ్య, కోడలు సుగుణమ్మలు హైదరాబాద్ గాంధీనగర్‌లో ఉంటారని చెప్పింది. తాను కొడుకు యాదయ్య ఇంట్లోనే ఉన్నానని తెలిపింది. అంతా విన్న ఆస్పత్రి సిబ్బంది అవ్వా‘ నీవు నీ కొడుకు ఇంట్లో లేవు.. కోరంటి దవాఖానలో ఉన్నావు’ అని చెప్పినా ఆ వృద్ధురాలు నమ్మడంలేదు. ‘నేను నా కొడుకు ఇంట్లేనే ఉన్నాను’ అని చెప్పడంతో అందరి హృదయాలు చలించిపోయాయి. ఎవరో కఠినాత్ములైన కొడుకులు కళ్లు కనిపించని తల్లిని ఇలా ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లారని ఆస్పత్రికి వచ్చిన రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫీవర్ ఆస్పత్రిలో 32 కుక్కకాటు కేసులు
నల్లకుంట (హైదరాబాద్) : స్థానిక ఫీవర్ ఆస్పత్రిలో శుక్రవారం 32 కుక్క కాటు, ఓ పంది కరిచిన కేసు నమోదు కాగా వీరిలో పదేళ్లలోపు చిన్నారులు నలుగురు ఉన్నారు. వీరందరికి వైద్యులు రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు. అలాగే ఓపీ విభాగంలో 381 మంది రోగులు వైద్య పరీక్షలు పొందగా వీరిలో 30 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇన్ పేషంట్లుగా చికిత్సలు పొందుతున్న వారిలో మూడు డిఫ్తీరియా కేసులున్నాయి. -
ఇంట్లో వారంతా కింద..దొంగలు పైన..
ఆ భవనంలోని వారంతా కింది అంతస్తులో పడుకున్నారని తెలిసిన దొంగలు..పై అంతస్తులో ఉన్న సొత్తును మూటగట్టుకుపోయారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేటకు చెందిన జి.శ్రీనివాస్(50) కుటుంబం న్యూనల్లకుంట బాయమ్మలేన్‌ను నివాసముంటున్నారు. పై అంతస్తులో ఉన్న ఏసీ పనిచేయక పోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నారు. అర్ధరాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని ఆగంతకులు పైఅంతస్తులోని గది తాళం పగుల గొట్టి అల్మారాలో మూడున్నర తులా బంగారు ఆభరణాలు, ఒక వెండి గిన్నె ఎత్తుకు పోయారు. శుక్రవారం ఉదయం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య మృతి
అతిగా మద్యం తాగడం వల్లే ? హైదరాబాద్: అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న ఓ మహిళ భర్త ఊరెళ్లొచ్చేసరికి మరణించింది. నల్లకుంట ఎస్సై మహేందర్‌రెడ్డి కథనం... వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జి.చలపతిరావుకు వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్‌కు చెందిన స్వరూప(30)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కడపలో ఉద్యోగం చేస్తున్న చలపతిరావు భార్యతో కలిసి అడిక్‌మెట్ లలితానగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. స్వరూపకు నిత్యం మద్యం తాగే అలవాటుంది. విధి నిర్వహణలో భాగంగా చలపతిరావు ఈనెల 22న కడపకు వెళ్లగా... స్వరూప ఒక్కత్తే ఇంట్లో ఉంది. గురువారం ఉదయం 8.30కి ఇంటికి తిరిగి వచ్చి భర్త తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో చలపతిరావు చుట్టు పక్కల వారి సహాయంతో కిచెన్ డోర్ తెరిచి లోపలికి వెళ్లగా.. మంచంపై స్వరూప చలనం లేకుండా పడి ఉంది. వెంటనే స్థానిక ఆర్ఎంపీ వైద్యురాలిని పిలిపించగా.. అప్పటికే స్వరూప మృతి చెందినట్టు వెల్లడించింది. చలపతిరావు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న స్వరూపకు కాలేయం పూర్తిగా పాడైందని వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫీవర్ ఆస్పత్రిలో 51 కుక్కకాటు కేసులు
నల్లకుంట (హైదరాబాద్) : స్థానిక ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం 51 కుక్కకాటు కేసులు నమోదు కాగా వీరిలో పదేళ్లలోపు చిన్నారులు 15 మంది ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుక్కకాటు బాధితుల ఒంటిపై గాయాలను శుభ్రం చేసిన అక్కడి వైద్యులు రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు. అలాగే ఓపీ విభాగంలో 930 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకోగా వీరిలో 30 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇన్ పేషంట్లుగా చేరి చికిత్సలు పొందుతున్న వారిలో మూడు డిఫ్తీరియా కేసులున్నాయి. -
పండగకు ఊరెళ్లితే..!!
నల్లకుంట: పండుగొస్తే చాలు పట్నంలో ఉండేవారి మనస్సు పల్లెల వైపు మళ్లుతుంది. పుట్టిపెరిగిన ఊరు గుర్తొస్తుంది. అక్కడ పండుగ జరిగే తీరు ముచ్చటగొలుపుతుంది. అందుకే పేరుకు నగరాల్లో నివసిస్తున్నా.. పండుగ అనగానే సొంతూరి వెళ్లాలని అంతా ఆశిస్తారు. ఇక సంక్రాంతి పండుగ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. ఇదేవిధంగా సంక్రాంతి పండుగ కోసం ఆనందంగా సొంతూరి వెళ్లివచ్చిన ఓ జంటకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఇంటికి గట్టిగా తాళం వేసి ఊరికి వెళ్లినా.. తిరిగొచ్చేసరికి దొంగలు పడి ఇల్లును గుల్ల చేశారు. ఇంట్లో వారు దాచుకున్న రూ. 12వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న గోకుల్ దేవీలాల్(25) భార్య విజయలక్ష్మితో కలిసి నల్లకుంట టీఆర్టీ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 10న ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి స్వగ్రామం ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం వెళ్లారు. తిరిగి శనివారం హైదరాబాద్‌కు వచ్చిన దంపతులు ఇంటికి వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడిఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ. 12 వేల నగదు కూడా కనిపించలేదు. ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించిన గోకుల్ దేవీలాల్ వెంటనే నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులుస కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
నల్లకుంట (హైదరాబాద్) : నగరంలోని నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సమీపంలో హుస్సేన్‌సాగర్ నాలా వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి( సుమారు 50 సంవత్సరాలు) పడి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు చూడగా అతను అప్పటికకే మృతి చెందాడు. శవ పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు. -
డ్రైనేజీ శుభ్రం చేస్తూ కార్మికుడి గల్లంతు
హైదరాబాద్: డ్రైనేజీ శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ కార్మికుడు ఒకరు గల్లంతైన సంఘటన నల్లకుంటలో చోటుచేసుకుంది. కార్మికులు రాములు, శ్రీనివాస్ లు ఆదివారం మధ్యాహ్నం నల్లకుంటలోని డ్రైనేజీని శుభ్రం చేసేందుకు లోపలికి దిగారు. అంతలోనే శ్రీనివాస్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. మరో కార్మికుడు రాములు కనిపించకుండా పోయాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలి వద్దకు చేరుకుని బోరున విలపించారు. జీహెచ్ ఎంసీ అధికారులు.. రాములు కోసం పెద్ద ఎత్తున గాలింపుచర్యలు చేపట్టారు. కాగా, డ్రైనేజీలో విషవాయువులు వెలువడటం వల్లే రాములు సృహకోల్పోయి గల్లంతై ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. -
బాహుబలి గణపతి
హైదరాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో వినాయక విగ్రహాలను వినూత్న రీతిలో తయారు చేస్తున్నారు. కాచిగూడకు చెందిన కొందరు భక్తులు ప్రత్యేకంగా పర్యావరణ సహిత మట్టి వినాయ విగ్రహాన్ని తయారు చేయించారు. శివలింగాన్ని భుజాన పెట్టుకుని గంగ దరికి చేర్చిన బాహుబలి వలే ఈ గణపతి ఆకర్షిస్తున్నాడు. ప్రతిమను సోమవారం శివం రోడ్డు గుండా ట్రాలీపై తరలిస్తుండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
నల్లకుంటలో చైన్ స్నాచింగ్
నల్లకుంటః నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాలు.. నల్లకుంట మోరం క్యారీలో నివాసం ఉండే ఆర్.రేణుక దేవి (41) నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును పట్టి లాగారు. వెంటనే అప్రమత్తమైన ఆమె గొలుసు గట్టిగా పట్టుకోవడంతో గొలుసులోని కొంత భాగం తెగి ఆమె చేతికి చిక్కింది. కాగా మరో చైన్ ముక్కతో ఆగంతకులు పరారయ్యారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చిన్నారి కిడ్నాపర్ల కోసం పోలీసు వేట షురూ
నల్లకుంట: ఈ నెల 6వ తేదీన న్యూనల్లకుంటలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అయితే, చిన్నారిని అపహరించిన వారి జాడ కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. అపహరించుకుపోయిన చిన్నారి కె.మమత(5) శనివారం సాయంత్రం ఏఎస్‌రావ్ నగర్లో స్థానిక యువకుడొకరు కుషాయిగూడ పోలీసులు సమాచారమందించాడు. రాత్రి 11.15 గంటలకు మమత తల్లిదండ్రులు కె.నారాయణ, మంజుల చెంతకు చేరింది. అపహరణపై అనుమానాలు... కిడ్నాప్ వ్యవహారంలో ఇద్దరు మహిళలు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు మమతకు నీటుగా కటింగ్ చేయించారు. అదే విధంగా నెయిల్ పాలిష్ వేసి, కాళ్లకు పట్ట గొలుసులు, కొత్త దుస్తులు తొడిగించారు. ఇదంతా చూస్తుంటే వారు ఆమెను ఎవరికైనా అమ్మకానికి పెట్టారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అపహరణలో బంధువులు, తెలిసిన వారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. వీడియో పుటేజీల ఆధారంగా చిన్నారిని అపహరించుకుపోయిన మహిళల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్ కు గురైన పాప ఆచూకీ లభ్యం
హైదరాబాద్:నగరంలో కలకలం సృష్టించిన చిన్నారి మమత ఆచూకీ శనివారం లభించింది. ఆ పాప కుషాయిగూడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా పాప ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం నల్లకుంటలో ఓ వీధిలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు మాయమాటలు చెప్పిన ఓ గుర్తు తెలియని మహిళ వారిని అపహరించింది. అయితే మార్గ మద్యంలో ఇద్దరు చిన్నారులను వదిలేసినప్పటికీ చిన్నారి మమతను మాత్రం తన వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు తమ గాలింపును తీవ్రతరం చేసి పాప ఆచూకీని కనుగొన్నారు. -
నల్లకుంటలో చిన్నారి అపహరణ
హైదరాబాద్: వీధిలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు మాయమాటలు చెప్పిన ఓ గుర్తు తెలియని మహిళ వారిని అపహరించింది. అయితే మార్గ మద్యంలో ఇద్దరు చిన్నారులను వదిలేసినప్పటికీ ఓ చిన్నారిని మాత్రం తన వెంట తీసుకెళ్లింది. ఈ సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు... న్యూ నల్లకుంటకు చెందిన నారాయణ, మంజుల దంపతుల పిల్లలు నవీన్(9), మమత (5) మరో చిన్నారి అంకిత(9)తో కలిసి ఆడుకుంటుండగా ఓ గుర్తు తెలియని మహిళ వారికి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని వెళ్లింది. ఆటో తార్నాక చేరిన తర్వాత ఇద్దర్ని వదిలివేసి మమత అనే చిన్నారిని తీసుకుని పరారయ్యంది. చిన్నారి అపహరణ గురించి మిగతా ఇద్దరు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తండ్రి వారిని ఇంటికి తీసుకోచ్చాడు. అయితే బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
వ్యభిచార ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని ఓ ఇంటిలో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వ్యభిచారానికి పాల్పడుతున్న బంగ్లాదేశ్‌కు చెందిన ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో గురువారం తనిఖీలు నిర్వహించిన స్పెషల్ టాక్స్పోర్సు పోలీసులు ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. వివరాలు.. అంబర్‌పేటలోని చైనాంబర్లో ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను, ఒక వృద్ధ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నల్లకుంటలోని బాయమ్మ వీధిలో వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు ఒంగ్లాదేశ్కు చెందిన మహిళలను, నలుగురు వృద్ధ విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విటులను అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలపై ఇండియన్ పాస్‌పోర్టు ఎంట్రీయాక్టు-1929 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (అంబర్‌పేట) -
విద్యార్థులను మోసం చేసిన విద్యోదయ అకాడమీ
హైదరాబాద్: నల్లకుంటలోని విద్యోదయ అకాడమీ పదవ తరగతి విద్యార్థులను మోసం చేసింది. పదవ తరగతి తప్పిన విద్యార్థులను ఉత్తీర్ణులను చేయిస్తానని ఆ సంస్థ 400 మందికి కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కొక్క విద్యార్థి నుంచి 4 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయల వసూలు చేశారు. ఆ తరువాత ఆ సంస్థ నిర్వాహకులు పరారయ్యారు. బాధిత విద్యార్థులు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.