డ్రైనేజీ శుభ్రం చేస్తూ కార్మికుడి గల్లంతు | ghmc worker missing while repairing drinage at nallakunta | Sakshi
Sakshi News home page

డ్రైనేజీ శుభ్రం చేస్తూ కార్మికుడి గల్లంతు

Published Sun, Oct 18 2015 2:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

ghmc worker missing while repairing drinage at nallakunta

హైదరాబాద్: డ్రైనేజీ శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ కార్మికుడు ఒకరు గల్లంతైన సంఘటన నల్లకుంటలో చోటుచేసుకుంది. కార్మికులు రాములు, శ్రీనివాస్ లు ఆదివారం మధ్యాహ్నం నల్లకుంటలోని డ్రైనేజీని శుభ్రం చేసేందుకు లోపలికి దిగారు. అంతలోనే శ్రీనివాస్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. మరో కార్మికుడు రాములు కనిపించకుండా పోయాడు.

 

సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలి వద్దకు చేరుకుని బోరున విలపించారు. జీహెచ్ ఎంసీ అధికారులు.. రాములు కోసం పెద్ద ఎత్తున గాలింపుచర్యలు చేపట్టారు. కాగా, డ్రైనేజీలో విషవాయువులు వెలువడటం వల్లే రాములు సృహకోల్పోయి గల్లంతై ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement