
బాహుబలి గణపతి
హైదరాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లో వినాయక విగ్రహాలను వినూత్న రీతిలో తయారు చేస్తున్నారు. కాచిగూడకు చెందిన కొందరు భక్తులు ప్రత్యేకంగా పర్యావరణ సహిత మట్టి వినాయ విగ్రహాన్ని తయారు చేయించారు.
శివలింగాన్ని భుజాన పెట్టుకుని గంగ దరికి చేర్చిన బాహుబలి వలే ఈ గణపతి ఆకర్షిస్తున్నాడు. ప్రతిమను సోమవారం శివం రోడ్డు గుండా ట్రాలీపై తరలిస్తుండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.