చిన్నారి కిడ్నాపర్ల కోసం పోలీసు వేట షురూ | police search for kidnapers | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాపర్ల కోసం పోలీసు వేట షురూ

Published Sun, Mar 8 2015 9:39 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

police search for kidnapers

నల్లకుంట: ఈ నెల 6వ తేదీన న్యూనల్లకుంటలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అయితే, చిన్నారిని అపహరించిన వారి జాడ కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. అపహరించుకుపోయిన చిన్నారి కె.మమత(5) శనివారం సాయంత్రం ఏఎస్‌రావ్ నగర్‌లో స్థానిక యువకుడొకరు కుషాయిగూడ పోలీసులు సమాచారమందించాడు. రాత్రి 11.15 గంటలకు మమత తల్లిదండ్రులు కె.నారాయణ, మంజుల చెంతకు చేరింది.


అపహరణపై అనుమానాలు...


కిడ్నాప్ వ్యవహారంలో ఇద్దరు మహిళలు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు మమతకు నీటుగా కటింగ్ చేయించారు. అదే విధంగా నెయిల్ పాలిష్ వేసి, కాళ్లకు పట్ట గొలుసులు, కొత్త దుస్తులు తొడిగించారు. ఇదంతా చూస్తుంటే వారు ఆమెను ఎవరికైనా అమ్మకానికి పెట్టారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అపహరణలో బంధువులు, తెలిసిన వారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. వీడియో పుటేజీల ఆధారంగా చిన్నారిని అపహరించుకుపోయిన మహిళల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement