నల్లకుంట (హైదరాబాద్) : నగరంలోని నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సమీపంలో హుస్సేన్‌సాగర్ నాలా వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి( సుమారు 50 సంవత్సరాలు) పడి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు చూడగా అతను అప్పటికకే మృతి చెందాడు. శవ పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు.