
సాక్షి, హైదరాబాద్ : నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో ఓ విద్యార్థిపై టీచర్ ప్రతాపం చూపించారు. 4వ తరగతి చదువుతున్న ఎన్.సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ప్లాస్టిక్ స్కేల్‌తో చేయి, వీపు భాగంలో కొట్టడంతో బాలుడి చర్మం ఎర్రగా కందిపోయింది. విద్యార్థి నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా టీచర్ కర్కశంగా వ్యవహరించింది. అరగంట పాటు తమ బిడ్డను టీచర్ చితక్కొట్టిందని విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపించారు. టీచర్ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. దిక్కున్నచోట చెప్పుకోండి అని బెదిరించారని వాపోయారు. ‘ప్రతి క్లాస్ రూమ్‌లో సీసీటీవీ ఉంది. ఆ రికార్డులను పరిశీలించి టీచర్‌పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment