వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది
తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెం సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.