తిరువనంతపురం: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ కంటైనర్ ఢీ కొట్టడంతో 20మంది అక్కడిక్కడే మృతిచెందగా, 31 మంది గాయపడిన ఘటన గురువారం తెల్లవారు జామున తిర్పూర్ జిల్లా వద్ద చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మృతుల్లో 5 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బెంగుళూరు నుంచి కేరళకు వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సును తిర్పూర్ జిల్లా వద్ద అవినాషి కోయంబత్తుర్ నుంచి సాలెమ్ వెళ్తున్న లారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంమైంది.
ఈ ఘటనపై ఎస్పీ శివ విక్రమ్ మాట్లాడుతూ.. అతి వేగం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్ ఓవర్‌లోడ్‌తో రాంగ్‌రూట్‌లో వస్తుండగా.. తిర్పూర్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును గమనించినప్పడికి అతివేగం కారణంగా లారీని అదుపుచేయలేక పోయినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఎస్పీ శివ విక్రమ్ పేర్కొన్నారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు
ఇక ఈ బస్సులో అధికమంది కేరళలోని పాలక్కడ్, త్రిస్పూర్, ఎర్నాకుళం పట్టణాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. ఈ ఘటన నుంచి బయటపడిన కరిష్మా అనే మహిళ మాట్లాడుతూ.. బస్స ప్రమాదం తెల్లవారు జామున 3:15 గంటల మధ్య జరిగిందని, ఆ సమయంలో తాను నిద్రిస్తున్నట్లు పేర్కొంది. కళ్లు తెరిచి చూసేసరికి చూట్టు అంతా గందరగోళంగా ఉందని అందరూ హడావుడిగా పరిగెత్తడం, గాయపడ్డవారిని ఆసుపత్రి తరలిస్తూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. ఇప్పటికి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నానని అయితే బస్సులో ఎడమవైపు కుర్చోవడం వల్లే తాను బ్రతికిపోయానని పేర్కొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment