Rtc bus - lorry collision
-
ఘోర ప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని అవినాషిలో కేరళకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ .10 లక్షల ఎక్స్‌గ్రేషి యా ప్రకటించింది. అత్యవసర సహాయంగా రూ .2 లక్షలు వెంటనే అందిస్తామని రవాణా శాఖ మంత్రి ఏకే ససీంద్రన్ తెలిపారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా కేరళ ప్రభుత్వం భరించనుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే మృతుల బంధువులు తమ వస్తువులను తీసుకొనేందుకు పాండి పోలీస్ స్టేషన్ అధికారులను 8300044804 లేదా 9498177908 నెంబర్లో సంప్రదించవచ్చని పాలక్కాడ్ జిల్లా కలెక్టర్డి బాలమురళి తెలిపారు. మృతదేహాలను తీసుకురావడానికి కేరళ ఇప్పటికే 20 అంబులెన్స్‌లను కోయంబత్తూరుకు పంపించినట్టు చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన కేఎస్ ఆర్టీసీ డ్రైవర్ గిరీష్, కండక్టర్ బైజు అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కేరళ ఆర్టీసీ వివిధ బీమా పథకాల ప్రకారం ఒక్కొక్కరికి రూ.30 లక్షలు పొందనున్నారని ససీంద్రన్ తెలిపారు. ఈ ప్రమాదంలో కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గిరీష్, కండక్టర్ బైజు కూడా మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డుప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 20కి పెరిగినట్టు సమాచారం. స్వల్ప గాయాలతో 20 మంది ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కళ్లు తెరిచి చూసేసరికి షాక్
తిరువనంతపురం: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ కంటైనర్ ఢీ కొట్టడంతో 20మంది అక్కడిక్కడే మృతిచెందగా, 31 మంది గాయపడిన ఘటన గురువారం తెల్లవారు జామున తిర్పూర్ జిల్లా వద్ద చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మృతుల్లో 5 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బెంగుళూరు నుంచి కేరళకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును తిర్పూర్ జిల్లా వద్ద అవినాషి కోయంబత్తుర్ నుంచి సాలెమ్ వెళ్తున్న లారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంమైంది. ఈ ఘటనపై ఎస్పీ శివ విక్రమ్ మాట్లాడుతూ.. అతి వేగం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్ ఓవర్‌లోడ్‌తో రాంగ్రూట్లో వస్తుండగా.. తిర్పూర్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును గమనించినప్పడికి అతివేగం కారణంగా లారీని అదుపుచేయలేక పోయినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఎస్పీ శివ విక్రమ్ పేర్కొన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు ఇక ఈ బస్సులో అధికమంది కేరళలోని పాలక్కడ్, త్రిస్పూర్, ఎర్నాకుళం పట్టణాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. ఈ ఘటన నుంచి బయటపడిన కరిష్మా అనే మహిళ మాట్లాడుతూ.. బస్స ప్రమాదం తెల్లవారు జామున 3:15 గంటల మధ్య జరిగిందని, ఆ సమయంలో తాను నిద్రిస్తున్నట్లు పేర్కొంది. కళ్లు తెరిచి చూసేసరికి చూట్టు అంతా గందరగోళంగా ఉందని అందరూ హడావుడిగా పరిగెత్తడం, గాయపడ్డవారిని ఆసుపత్రి తరలిస్తూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. ఇప్పటికి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నానని అయితే బస్సులో ఎడమవైపు కుర్చోవడం వల్లే తాను బ్రతికిపోయానని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. డ్రైవర్ మృతి
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్‌రోడ్డులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు కండక్టర్ సహా ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ బస్సు విజయవాడ నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు వెళుతోంది. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కండక్టర్ పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.