చింతపల్లి(విశాఖపట్నం): వేగంగా వెళ్తున్న వ్యాను అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను గణేశ్(12), నరసింగరావు(14)గా గుర్తించారు. క్షతగాత్రులను చింతపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యానులో కోరుకొండ సంతకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వ్యాను బోల్తా.. ఇద్దరు మృతి
Published Sun, Apr 30 2017 10:17 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM
Advertisement
Advertisement